Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
భూమి కూలి ఉపాధి కై ఉదతమైన పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపు నిచ్చారు. శని వారం రోజున మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు మండ రాజన్న అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా హాజరైన జి.నాగయ్య మాట్లాడుతూ భూమిలేని పేదలు సమా జంలో సగభాగం ఉన్నారని వారందరికీ భూమి పంచడం ద్వారా పేదరికం నుండి దూరం చేయవచ్చు అని భూస్వాములు పెత్తందారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధీనంలో ఉన్న మిగులు భూములు ప్రభుత్వ భూములు బయటికి తీసి పేదలకు పంచాలని నాగయ్య డిమాండ్ చేశారు లేనిపక్షంలో పేదలని సమీకరించి సంఘం ఆధ్వర్యంలో పేదలకు భూములు పంచుతామని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభు త్వం ఉపాధి హామీ చట్టాన్నికి నిధులు తగ్గించి సవరణలు తీసుకొచ్చి చట్టాన్ని నిర్వీ ర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నదని అన్నారు. ఉపాధి కూలీల నోట్లో మన్ను కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నదని మండిపడ్డారు. పేదలందరికీ రేషన్ కార్డు పై 16 రకాల నిత్యావసర సరుకులు అందించి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, జిల్లా అధ్యక్షులు మండ రాజన్న, సహాయ కార్యదర్శి కుర్ర మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, బాణాల రాజన్న, వంగూరు వెంకటేశ్వర్లు, ఉప్పనపల్లి శ్రీనివాస్, చేపూరి గణేష,్ గుండు సురేష్, షేక్ మన్సూర్, స్వామి, రామేశ్వరం, యాదగిరి, అనంత చారి, పులి వెంక టేశ్వర్లు, బ్రహ్మచారి పుల్లూరు దేవయ్య, మంజుల ఆనందరావు పాల్గొన్నారు.