Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపు
నవతెలంగాణ-మహబూబాబాద్
స్వాతంత్రోద్యమ నాయకురాలు, ట్రేడ్ యూనియన్ నాయకురాలు విమల రణదీవే పోరాట స్ఫూర్తితో శ్రామిక మహిళలు తమ హక్కుల సాధనకై పోరాడాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపు నిచ్చారు. విమల రణదీవే 108వ జయంతి వారోత్సవాల్లో భాగంగా శనివారం సిఐటియు ఆఫీసులో సభ నిర్వహించారు. ముందుగా విమలా రణదీవే చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్య దర్శి కుంట ఉపేందర్, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చింత మౌనిక, కో కన్వీనర్ తోట పుష్పలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తోట పుష్ప అధ్యక్ష తన జరిగిన సభలో ఉపేందర్, మౌనికలు పాల్గొని ప్రసంగిస్తూ విమల రణదీవే 12 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొని జైలు జీవితం అనుభవిం చారని తెలిపారు. అఖిల భారత శ్రామిక మహిళ సమన్వయ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్‌గా అంగన్వాడి యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారని తెలి పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబింస్తున్న విధానాల వలన మహిళల హక్కులు కాలరాయటంతో పాటు,భద్రత లేక దౌర్జన్యాలు పెరిగి పోయాయని తెలి పారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు జీతం లేని సేవా, సంరక్షణ పను లు చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించే పనులు చేస్తున్న స్కీంవర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా కనీస వేతనాలు అమలు చే యకుండా ప్రభుత్వాలు శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని విమర్శించారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వేతనాలు, గౌరవం, పదోన్నతుల విషయంలో తీవ్ర వివక్షకు, అవమానాలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలు ఏమి ధరించాలి, ఎవరితో మాట్లాడాలనే విషయాలపైఆంక్షలు విధిస్తున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని, పురుషు లతో సమానంగా కనీస వేతనాలు చెల్లించాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మా ణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కుల పరిరక్షణకు శ్రామిక మహిళలు ఐక్యంగాపోరాటాలు నిర్వహించినపుడే విమల రణదివేకి అర్పిం చే నిజమైన నివాళియని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మేట రాజమౌళి, వెలి శాల సుధాకర్, నీలం కష్ణవేణి, స్నేహబిందు, కొత్త రజిని, గుగులోత్ ఝాన్సీ, వేముల రుజన్య, సరస్వతి, రేణుక, అరుణ, సమత తదితరులు పాల్గొన్నారు.