Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు లేకుండానే రియల్టర్లు మట్టి తరలింపు - పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పాలకుర్తి
రియాల్టర్లు తమ భూములను చదును చేసుకునేందుకు తోడేండ్ల కుంట పై కన్ను వేశారు. శుక్రవారం మండలంలోని ముత్తారంలో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ టర్లు మట్టిని తోడేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమన హారం. రియల్ టర్ కొనుగోలు చేసిన భూమిలో పెద్ద పెద్ద గుండ్లు ఉండ టంతో గుండ్లను తొలగించి గుంతలు ఏర్పడ్డ చోట గుంతలను పూడ్చేందుకు భారీ యంత్రాలతో పాటు వాహనాలను తోడేళ్ల కుంటలో మొహరించి యదేచ్చగా వంద లాది ట్రిప్పుల మొరాన్ని తరలించారు.ముత్తారం గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతి నిధి అనుమతి తీసుకున్నానని రియల్టర్ గ్రామస్తులను తప్పుదోవ పట్టించి యదేచ్చగా మట్టిని తోడేశాడు. ఎవరి అనుమతులు లేకుండా రియల్ టర్ తోడేళ్ల కుంటలో మట్టిని తవ్వేస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు అంటి ముట్టన ట్లుగా వ్యవహరించడంతో రియల్ టర్లకు అక్రమార్లకు అడ్డు అదుపు లేకుండా పో యిందని చర్చ జరుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా రియాల్టర్ తోడెం డ్ల కుంట పై కన్ను వేయడంతో గ్రామపంచాయతీ ఆదాయానికి గండి పడుతుం దని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని చెరువులు, కుంటలలో రియేటర్లతో పాటు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వేస్తున్న సంబం ధిత శాఖల అధికారులు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మండలంలో చెరువులు కుంటలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వినప్పటికీ అధికారుల కంటికి కనబడుట లేదా అనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రియల్టర్లు అక్రమార్కుల ఆటల ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మట్టి తవ్వకాలపై సంబం ధిత శాఖల అధికారులు స్పందించకపోవడం రియాల్టర్లకు అక్రమార్కులకు ఇష్టా రాజ్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.