Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో అన్నదాతలు - వరి పంటను కాపాడుకునేందుకు ఆరాటం
- వరి కోత మిషన్ల కోసం పోటాపోటీ
నవతెలంగాణ-పాలకుర్తి
ఆరుగాలం కష్టపడిన రైతన్నకు పంట చేతికొచ్చే సమయానికి మబ్బులు దడ పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎండలు మండడంతో, వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు మబ్బులు కమ్ముకోవడం వల్ల అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణలోని పలుజిల్లాలకు వర్ష సూచన ఉందని వాతా వరణ శాఖ ప్రకటించడం, దానికి తోడు గురువారం సాయంత్రం నుండి మబ్బులు కమ్ముకోవడంతో కోతకొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు ఆరాట పడుచున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సుమారుగా 35 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన అన్నదాతలు కరెంటు కోతలను సైతం లెక్కచేయకుండా,చాలీచాలని సాగునీరు వరిపంటకు అందిస్తూ, పలు రకాల తెగు ళ్లు వరి పంటను ఆశించినప్పటికీ వేల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతన్నలు వరి పంటను కాపాడుకున్నారు. తెగుళ్ల బారిన పడిన వరి పంట చేతికొచ్చే సమ యం ఆలస్యమైనప్పటికీ ప్రకతి రైతన్నలను పరేషాన్కు గురిచేస్తుంది. మబ్బులతో భయాందోళనకు గురవుతున్న రైతులు వరి పంటను కాపాడుకోవడం కోసం పోటీ పడుచున్నారు. వరి పంటను కోసే వరి కోత యంత్రాలు గ్రామీణ ప్రాంతాల్లో అర కొరగా ఉన్నప్పటికీ వరి కోత యంత్రాల కోసం రైతులు పోటీ పడుతూ బారులు తీరుచున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ నామమాత్రంగా వరి కోతలు ప్రా రంభమైనప్పటికీ ఎక్కువ శాతం వరి పంటలు కోతకు రెడీగా ఉండడంతో వరి కోత యంత్రాల యజమానులకు డిమాండ్ పెరిగింది. వరి కోతలను రాష్ట్ర ప్రభుత్వం దష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సబ్సిడీపై వరి కోత యంత్రాలు అందించాలని రైతులు కోరుచున్నారు.