Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవ సాయనికి అనుసంధానం చేయాలనే డిమాండ్ జోరందుకుంది. ఊరూరా ఉత్తర యుద్ధం నిరసన కార్యక్రమంలో కూలీలు, రైతులు పెద్ద సంఖ్యలో పా ల్గొంటున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలు పుకు కూలీలు, రైతుల నుంచి అనూహ్యంగా స్పంది స్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 100 గ్రామాలకు పైగా ఉత్తర యుద్ధం సాగిం ది. ఒక్కో గ్రామంలో 450 మంది నుంచి 900 వర కు పెద్ద గ్రామంలో 1450 మంది ఈజీఎస్ జాబ్ కార్డుదారులు పోస్టులు చేస్తూ ఉత్తర యుద్ధం నిరసనలో పాలుపంచుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు దొరకడానికి వ్యవసాయానికి అనుసంధానం చేయడమే ఏకైక మార్గమనే అభిప్రా యంపై గ్రామాల్లో సర్వత్రా చర్చ సాగుతుంది. యే డాది మొత్తంగా పనిదినాలు దొరకడంతో పాటు కూ లీలకు సరైన కూలి వేతనం గిట్టుబాటు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఇప్పటి వరకు ఉపాధి పనిపై రూ.257కుగానూ రోజకు రూ.100కు వేత నం మించడం లేదని కూలీలు వాపోతున్నారు. కనీస వేతన చట్ట ప్రకారం రోజుకు రూ.480 చెల్లించాలని ఉపాధి కూలీలుడిమాండ్ చేస్తున్నారు. ఈజీఎస్కు అనుసంధానం చేయడం వల్ల రైతులకు పంటపై కూ లీల ఖర్చుతగ్గుతూ పెట్టుబడి భారంనుంచి ఊరట కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. ఈ ఉత్తర యుద్ధానికి ప్రతి ఊరిలో పోస్టుకార్టు చేతపట్టుకొని బారులు తీరుతుండడమే ఈ అనూహ్య స్పందనకు నిదర్శనమని చెప్పొచ్చు.
ఇటుకాలపెల్లి గ్రామంలో..
మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో ఉత్తర యుద్ధం కార్యక్రమం నిర్వహించారు. రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతూ పోసు కార్డులు చేతపట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు.
రాజుపేట గ్రామంలో ఉత్తర యుద్ధం..
మండలంలోని రాజుపేట గ్రామంలో శనివారం ఉత్తర యుద్ధం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయ క్, సర్పంచ్ భానోతు దస్రు, ఎంపీటీసీ బాధవత్తు వీరన్న తదితర కూలీలు, రైతులు పాల్గొన్నా రు.ముత్తోజీపేట గ్రామంలో ఉత్తర యుద్ధంలో జాబ్ కార్డుకూలీలు, రైతులుపెద్దసంఖ్యలో పాలు పంచుకు న్నారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, సర్పంచ్ గోలి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.