Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యుల రైజ్ చేయాలని మండలంలోని అన్ని గ్రామాల పంచా యతీ కార్యదర్శులు శనివారం మండల ఎంపిడిఓ నరసింహమూర్తికి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల ప్రొఫెషన్ పీరియడ్ ఈనెల 11న ముగిసినప్పటకీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రొబిషన్ కాలం పూర్తయి నట్టు గాని మా ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేస్తామ న్నట్టుగాని ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రా ష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 9500 కుటుంబాలు రోడ్డున పడేపరిస్థితి వస్తుందని భయాందోళనకు గుర వుతున్నారన్నారు. 15 రోజుల గడువు ముగిసిన వెం టనే మేమందరం సమ్మెకైన సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఎంపి డిఓకు ముందుస్తుగా వినతిపత్రం అందించారు. ప్ర భుత్వానికి, ప్రభుత్వ విధానాలకు జెపీఎస్లు వ్యతి రేకం కాదని ప్రజల సేవకు ఎల్లవేళలా మేము ఉంటా మని తమరికి హా మీ ఇస్తూ తమను వెంటనే రెగ్యుల ర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఖానాపురం : రాష్ట్రంలోని పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ వెం టనే పర్మినెంట్ చేయాలని మండల జూనియర్ పం చాయతీ సంఘ ఉపాధ్యక్షుడు భూక్య సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ కలిసి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షకులు వెంకటేశ్వర రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల ప్రొబేషన్ పిరియడ్ పూర్తికాగానే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పి నాలుగు సంవత్సరాలకు పొడిగించిందని, ప్రస్తుతం నాలుగు సంవత్సరాల వ్యవధి కూడా పూర్తిగా అవడంతో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సేవలు గుర్తించి వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని అన్నారు.
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సమ్మె నోటీసు అందించామని, ఏప్రిల్ 28వ తారీకు వరకు ప్రభు త్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల స్పందన లేకపోతే 28వ తారీకు నుండి రాష్ట్రవ్యా ప్తంగా నిరసనలు చేపడుతామని అన్నారు. ఈ కార్య క్రమంలో సీనియర్ అసిస్టెంట్ పథ్వీరాజ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, ఆఫీస్ సభార్డినేట్స్ సుజాత, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.