Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొల గించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత ఎన్నికల అధికారు లను ఆదేశించారు. శనివారం హనుమకొండ ఐడిఓసిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీ లనపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సం ధ్యారాణినితో కలిసి, ఈఆర్వో, ఎఈఆర్వోలు, సంభందిత ఎ న్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స మావేశంలో జిల్లాకలెక్టర్ మాట్లాడుతూఓటర్ జాబితా 202 2-23 మధ్యకాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు తిరిగి మరోసారి క్షేత్రస్థాయిలోఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సంభందిత ఎన్నికల అధికారులు పరి శీలించి, ఫో టో సిమిలర్ ఎంట్రీ స్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీస్, క్షుణ్ణంగా పరిశీలించి, 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి చర్యలు లేకుండా తొలగించబడిన ఓటర్ల జాబితాను తిరిగి మరోసా రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్లను తిరిగి ఫారం -6 ద్వారా దరఖాస్తులను స్వీకరించి, ఓటర్ జాబితా లో నమోదు చేయాలన్నారు. చనిపోయిన ఓటర్లను మరోసారి పరిశీలించి ఫారం-7లో వివరాలు పూర్తిస్థాయిలో రికార్డు చే సి, సమర్పించాలని ఆదేశించారు. బదిలీ ఓటర్లుగా తొల గించిన వారి జాబితాలో ఒకవేళ వారు ఇక్కడే నివాసం ఉన్న ట్లయితే, మరోసారి ఫారం-6 ద్వారా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని, ఈ పూర్తి ప్రక్రియను ఈఆర్వోలు, ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధవహించలన్నారు. జిల్లాలో బూతు స్థాయి అధికారులుగా నియమించిన వారి జాబితాను పరిశీ లించి, ప్రభుత్వం నుండి జీతం పొందుతున్న వారిని మాత్ర మే నియమించాలని, ఎవరైనా ఇతర ప్రైవేటు వ్యక్తులు ఉన్న ట్లయితే వారిని తొలగించి ప్రభుత్వరంగ ఆధీనంలో పనిచే యు వ్యక్తులను మాత్రమే నియమించాలన్నారు. ఈ సమావే శంలో డిఆర్ఓ వాసు చంద్ర, పరకాల ఆర్టీవో రాము, కలెక్టరే ట్ ఎన్నికలసెక్షన్ సూపరిండెంట్ జ్యోతివరలక్ష్మి, తహశీల్దా ర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.