Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని తాటికొండ గ్రా మంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ అక్కన పల్లి తిరుపతయ్య ఆశయాలను కొన సాగిద్దామని సిపిఎం మండల కార్య దర్శి మునిగెల రమేష్ అన్నారు. ఆది వారం జరిగిన కామ్రేడ్ తిరుపతయ్య సంస్మరణ సభ పార్టీ ఆధ్వర్యంలో జరి గింది. ఈ సందర్భంగా రమేష్ మా ట్లాడుతూ నాటి నిజం నిరంకుశపాలన, పెత్తందారులు, భూ స్వాముల పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన తిరు పతయ్య, భూస్వాముల ఆగడాలను ఎదిరించి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాటం చేశాడని కొనియాడారు. నేటి యువతరం తిరుపతయ్య జీవిత చరిత్ర అనుసరించి ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఫాసిస్ట్ ప్రభుత్వం ఉందని, మతం పేరిట కుల, ప్రాంతాల భేదాల పేరిట మధ్య చిచ్చు పెడుతూ ప్రజ లను విభజించి, రాజకీయాలు చేస్తూ మనువాదానికి ఊతం ఇచ్చే కుట్రలు చేస్తూ, దేశాన్ని నాశనం చేసే దిశగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. తిరుపతయ్య కు నిజమైన నివాళిగా ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. మే 1న మేడే సందర్భంగా మండ లంలోని అన్నీ గ్రామాల్లో కార్మిక, కర్షక, అన్ని కార్మిక రంగా లు, యువత, రైతు సంఘం, విద్యార్థి, మహిళ లోకం, అన్ని వర్గాల ప్రజలు ఎర్రజెండాను ఎగురవేయాలని, ప్రజలు ఎర్ర జెండా నాయకత్వంలో చైతన్యవంతం కావాలని సూచిం చారు. సమసమాజ స్థాపన కేవలం ఎర్రజెండాతోనే సాధ్య మవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొడెపాక యాకయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షులు మైలారం వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు, నాయకులు సిద్దుల సుదర్శన్, చిలుముల్ల భాస్కర్, ఉమ్మ గోని రాజు, లింగబోయిన కుమారస్వామి, తోక రాజు, నర్సింహులు, గాజుల రమేష్, పూల శ్రీను, పెద్దిరెడ్డి, కనక య్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.