Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం తెరాస ప్రభుత్వం లక్ష్యంగా పని చే స్తుందని డోర్నకల్ శాసన సభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారురాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీ కగా బిఆర్ఎస్ ప్రభుత్వం పండగలకు ప్రాధాన్యమిస్తూ ఆయా వర్గాల ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఇండోర్ స్టేడియంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలోని4 మండలాలు మరిపెడ నరసింహల పేట, చిన్న గూడూరు, దంతాలపల్లి పేద ముస్లింలకురంజాన్ కానుక పంపిణీ కార్యక్ర మాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొంత మంది లబ్ధిదారులకు అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో తెరాస ప్రభుత్వం హిందువులకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ క్రిస్మస్ సందర్భం గా క్రిస్టియన్లకు, ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ప్రజానీ కానికి రంజాన్ కానుక అందించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలిపె లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పండగలు అనేవి సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు. అయితే పండుగల వేళ నిరుపేద ప్రజానీకం నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండగ వేళ బట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవి, ఎంపీపీ అరుణ రాంబాబు, జెడ్పిటిసి శారద రవీందర్, వైస్ ఎంపీపీ బుచ్చిరెడ్డి, తాసిల్దార్ పిల్లి రాంప్రసాద్, కౌన్సిలర్లు, కోప్షన్స్ మెంబర్స్ మక్సుద్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ లతీఫ్, మండల మైనార్టీ అధ్యక్షులు హబీబుద్దీన్, మండల ఆర్గనైజర్ యా కుబ్ పాషా, మాజీ కో ఆప్షన్ సభ్యులు అయుబ్ పాషా పాల్గొన్నారు.