Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రోస్ ఎండీ కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-పెద్దవంగర
పంటల సాగులో విత్తన శుద్ధి ఎంతో కీలకమని, తద్వారా అధిక దిగబడి సాధ్యమౌతుందని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంట్లకుంటలో ఆగ్రోస్ ఆధ్వర్యంలో రైతులకు వరి, మిర్చి, పత్తి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. విత్తన శుద్ధి ప్రాముఖ్యతను రైతులకు వివరించి, పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంపిక ఎంత ముఖ్యమో.. విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని నాటడం అనేది కూడా అంతే ముఖ్యం అన్నారు. కంటికి కనిపించని శిలీంధ్రాలు, పురుగుల దాడి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఎంతైనా అవసరమని తెలిపారు. విత్తనశుద్ధి చేయడంవల్ల విత్తనం ద్వారాగాక నేల ద్వారా వచ్చే తేగుళ్లను ఆదిలోనే అరికట్టవచ్చునని పేర్కొన్నారు. నారు పోసిన 20 నుండి 28 రోజుల్లోగా నాటు వేయాలన్నారు. తద్వారా నాటు ఎదుగుదలతో పాటుగా, అధిక పిలకలు వస్తాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫీల్డ్ ఆఫీసర్ చింతకింది సందీప్, రావుల మహేందర్, కడారి ఉపేందర్, బొమ్మగాని శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.