Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓకే గదిలో ఐదు తరగతులు 80 మంది విద్యార్థులు
- ఆ భవనాన్ని ఎంఈఓ కార్యాలయానికి ఇవ్వండి
- ఉపాధ్యాయ సంఘాల వినతి
- జిల్లా అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది ఖాళీ చేయబడిన జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని మండల ఎంఈఓ కార్యాలయం కు కేటాయించకపోవడం మూలంగా విద్యార్థులు నానాఇబ్బందులు పడుతున్నా రు. ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు అవస్థలు పడుతుం డగా 80 మంది విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.పూర్తి వివరాల ప్ర కారం మహబూబాబాద్ పట్టణంలో గత 20 సంవత్సరాల క్రితం ఆర్డీవో కార్యాల యం సమీపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్రానికి విశాల భవనం నిర్మించారు.ఈ భవనంలో మహబూబాబాద్ ఎంఈఓ కార్యాలయం ఏ ర్పాటు చేశారు. డిప్యూటీ డిఇఓ కార్యాలయాన్ని ఇదే భవనంలో నిర్వహించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ భవనంలోనే విద్యా శాఖ కార్యాలయాలు కొనసాగాయి. మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసిన క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి భవనాలు లేకపోవడంతో ఈ మండల విద్యా వనరుల కేంద్రాన్ని డీఈవో కార్యాలయంగా ఏర్పాటు చేశారు.ఆ భవనంలో ఉన్న ఎంఈఓ కార్యాలయాన్ని సమీపంలో ఉన్న గుమ్మనూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి మార్చారు. ఆ పాఠశాల ఆవరణలోఒక గదిలో ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. మరొక గదిలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు 80 మంది విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా ఏర్పాటు నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఒకే గదిలో అయిదు తరగతిల విద్యార్థులు 80 మంది విద్యా ర్థులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల నూతన కలెక్టరేట్ సమీకృత భవనం ప్రా రంభించారు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నూతన కలెక్టర్ట్లోకి మార్చారు.ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పాత విద్యా వనరుల కేంద్రాన్ని ఎంఈఓ కార్యాలయంకు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు జిల్లా అధికారులకు విన్నపాలు అందిం చారు. గత రెండు నెలలుగా విద్యాశాఖ అధికారుల చుట్టూ సంఘాల నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుత ఎంఈఓ కార్యాల ఆవరణలోఉన్న ఒక్క గదిలో పాఠాలు చదవలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ఎంఈఓ కార్యా లయం కూడా ఒక్క గదిలోనే కొనసాగుతుంది. ప్రస్తుత ఎంఈఓ కార్యాలయాన్ని విద్యా వనరుల కేంద్రానికి కేటాయించినట్లయితే అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యా యులకు అనుకూలంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేసి నెల రోజులు గడిచిన ఎలాంటి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంఈఓ కార్యాలయానికి భవనం కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి : యూటీఎఫ్ మండల అధ్యక్షులు గొడిశాల సంజీవ
విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి డిఇఓ కార్యాలయం ఖాళీ చేసిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంది విద్యార్థులకు అను కూలంగా ఉంటుంది. ఉపాధ్యాయుల సమావేశాల నిర్వహణ కూడా సమంజసంగా ఉంటుంది.