Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండల కేంద్రానికి చెందిన వర్దినేని సరళ - భూపాల్ రావు వారి తల్లిదండ్రులు వర్ధినేని రాధమ్మ -చలపతిరావు జ్ఞాపకార్థం పర్వతగిరి శ్రీ కంఠమ హేశ్వర స్వామి గుడికి ఆదివారం 50 వేల 116 రూపాయలు పర్వతగిరి గీతా పారిశ్రామిక సహకార సంఘానికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుల్లూరు సారయ్య, ఉప సర్పంచ్ రంగు జనార్దన్, గౌరవ అధ్యక్షుడు రంగు కుమార్, కార్యదర్శి తీగల వీరస్వామి, టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్, డైరెక్టర్లు కక్కర్ల యాకాంబరం, దొనికెన దయాకర్, మెరుగు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.