Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్ష న్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహబూబాబాద్‌లో టీఎస్ సిపిఎస్ ఈయు జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెన్షన్ కాన్స్టిట్యూషన ల్ మార్చ్ అనే పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో ఉద్యో గులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని లోప భూయిష్టమైనటువం టి సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏక కంఠంతో నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు నాగమణి అధ్యక్షుడు జరిగిన సభలో రాష్ట్ర కార్య దర్శి ఆవునూరి రవి మాట్లాడారు. కేంద్రంలోని పిఎఫ్ ఆర్డీ ఏ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. సిపిఎస్ విధానంలో రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ అసరా పెన్షన్ కన్నా తక్కువ వస్తుందని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా రద్దుచేసి పాత పెన్షన్‌ని అమలు పరచాలని కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షు లు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని పాత పెన్షన్ కూడా త్వరలోనే సాధించు కుంటామని అన్నారు. మరోముఖ్యఅతిథి రాష్ట్ర ప్రచార కార్య దర్శి శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయు ల ఏకైక నిదానం సిపిఎస్ అంతమని దానికోసం దశల వారి పోరాటాలు చేస్తామని అందుకు ఉద్యోగ ఉపాధ్యాయుల సం పూర్ణ మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూసపాటి నాగముని గోపు లక్ష్మీకాంత్ జిల్లా కోశాధికారి మల్లేశం జిల్లా కార్యవర్గ సభ్యులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరన్న ,అశోక్ కుమార్ వివిధ సంఘాల నాయకులు టీజీవో అధ్యక్షులు హరికోట్ల రవి, పిఆర్టియు టీఎస్ అధ్యక్షులు సంకా బద్రి నారాయణ, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, టిపిటిఎఫ్ అధ్యక్షులు చుంచు శ్రీశైలం, టీఎన్జీవో అధ్యక్షులు వడ్డెబోయిన శ్రీనివాస్, టీఎస్ టిటిఎఫ్ అధ్యక్షులు వీరు నాయక్ జీజేసిపిఏ అధ్యక్షులు సదానందం, వైద్య విధాన పరిషత్ బాధ్యులు డాక్టర్ రాజకుమార్, ఎస్సీ ఎస్టీ సంఘం ప్రభాకర్, ఎస్జీటీఎఫ్ అధ్యక్షులు ప్రవీణ్, టీఎస్ బాధ్యులు జి రవీందర్ మున్సిపల్ అసోసియేషన్ ఉద్యోగ బాధ్యులు రమేష్ మరియు అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మహిళా సభ్యులు, సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.