Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
రోజుకో మాట పూటకో అబద్ధంలు చెప్పడం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నైజం అని మండలంలో కోట్ల రూ వ్యా యంతో అబివృద్ధికి శిల పలకాలు వేసి నెలలు గడుస్తున్న ఇంతవరకు తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు పోయలేదని మాట లు తప్ప చేతల్లెవ్వని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేం ద్రంలో నర్సంపేట, నెక్కొండ ప్రధాన రహదారిపై వంట వార్పు, నిరసన, రాస్తారోకోలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ కరువైందని ఆ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మేక వన్నె పులిలా అభివద్ధి పనుల పేరిట ప్రజల్లో తిరుగుతూ, ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో హడావిడిగా శిలాఫలకాలు వేస్తూ కోట్లల్లో నీధులు మంజూరైనట్లు ఆశలు చూపిస్తూ దళిత బంధు పేరుతో ఓట్లను దక్కించుకునేందుకు ప్రజల ను, దళితులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నా డని అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. చొక్కాలే దిక్కులేని నువ్వు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని, దళిత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూకబ్జాలకు పాల్పడి వేల కో ట్లు రూపాయలు సంపాదించుకొని పచ్చి అబద్దాలు చెప్పు కుంటూ గ్రామాల్లో తిరుగుతున్నవని మండిపడ్డారు. కాం గ్రెస్ పార్టీ ప్రజల్లో విస్తరిస్తున్న తరుణంలో పార్టీ యొక్క ప్రభాల్యాన్ని తగ్గించలేరని పదో తరగతి పరీక్షలు మొద లుకొని గ్రూప్1, గ్రూప్ 2 వరకు లీకేజీల పర్వం, లిక్కర్ స్కాం, రాష్ట్ర ప్రభుత్వ యొక్క బలహీనతను వెక్కిరిస్తూ దొంతి మాధవరెడ్డి హాత్ సే హాత్ జూడో యాత్రను నిర్వ హిస్తున్నారని రాష్ట్రంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఆస్తులను కాపాడుకోవడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం రాష్ట్రంలో లీకుల పర్వాన్ని కొనసాగిస్తూ వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ఎద్దువ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు నన్ను బోయిన రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధన రమేష్, తప్పెట రమేష్, మండల నాయకుల భూక్య సురేష్ ,పోలే పెళ్లి బిక్షపతి, జోరు వీరయ్య, బొమ్మ కంటి రాజు, సర్పంచులు, ఉప సర్పంచులు, క్లస్టర్ బాధ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.