Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
- నేటి నుండి సమ్మెకు పిలుపు
నవతెలంగాణ-గూడూరు
గ్రామాలలోని క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల నిర్వ హణ అభివృద్ధి కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న వివో ఏలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిష్కరించవలసిన ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వివరించడం తో వివోఏలు నేటి నుండి నిర్వధిక సమ్మెకు వెళ్లనున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 681 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి ఒక్కొక గ్రామానికి సంఘానికి ఒక వివోఏ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామ సం ఘాలలోనీ సుమారుగా లక్ష ఇరవై వేల మందికి మహిళలకు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నారు. గత 20 సంవత్సరాల పై బడిగా అతి తక్కువ వేతనంతో వివోఏలు విధులు నిర్వ హిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ సంఘాలకు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీస్తే వెళ్లే అమలు జరిగేలా భూమిక పోషిస్తున్నారు. కానీ వీరికి గుర్తిం పు లేదు. అతి తక్కువ వేతనంతో ఎట్టి చాకిరి చేస్తూ కాలం గడుపుతున్నారు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసు కుపోయిన సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫల మైందని వీఎవోలు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామ సంఘం లోని ఒక్కొక్క గ్రూప్ సభ్యుల్లకి లావాదేవీలు నడిపించే బాధ్య త గ్రూప్‌కు సంబంధించిన సభ్యులందరికీ లోన్లు వచ్చేలా, తిరిగి కట్టించే విధంగా పూర్తి బాధ్యత వహిస్తారు. అంతేకా కుండా అదనంగా ప్రతి సర్వే కూడా వీరు భాగ స్వాములు అవుతున్నారు. పనికి తగ్గ వేతనం లేకపోవడం వల్ల చాలీచా లని వేతనంతో కుటుంబ ఆర్థికవత్తుల గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల మహబూబాద్ జిల్లాలో సిఐటియు ఆధ్వ ర్యంలో వివో ఏలకు అండగా నిలిచింది. వినూతన కార్య క్రమాలు చేపడుతూ వానిని వినిపిస్తుంది. ఇటీవల గూడూ రు మండలంలో మహబూబాబాద్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ఆధ్వర్యంలో విఏఓ లతో కలసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ,సమ్మె నోటి సందేశాలు ఈనెల 17 నుంచి నిర్వర్తిక సమ్మె పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 18 వేల మంది సమ్మెలో పాల్గొన్న వారు విధులను బహిష్కరించి ఆయా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొననున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
వివోఏలనుసెర్ఫ్ఉద్యోగులుగా గుర్తించాలి,ఉద్యోగ భద్ర త కల్పించాలి,కనీస వేతనం 26,000 ఇవ్వాలి,సెల్ఫ్ నుండి ఐడెంటి కార్డులు యూనిఫార్మ్స్ అందజేయాలి,ప్రతి విఏవోకి సాధారణ భీమా కల్పించాలి,పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి, ఉద్యోగ బాధ్యతలో ఉండగా మరణించినట్లయితే వివోఏ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేయా లి. ఎస్‌హెచ్‌జిలకు రావలసిన బ్యాంక్ శ్రీనిధి విఎల్ఆర్ పూర్తిగా అందజేయాలి.అభయాస్తం నగదు ప్రతి సభ్యురాల కు తిరిగి ఇవ్వాలి. సంఘంలోని ఉన్న ప్రతి సభ్యురాలు కు టుంబానికి హమ్ ఆద్మీ యోజన జనశ్రీ భీమ యోజన సౌ కర్యం కల్పించాలి, సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికి ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలి, వివో ఎలా గౌరవ వేతనం నేరుగా వారి సొంత అకౌంట్లోనే చేయాలి.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటాం : సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తూ వివో ఏల కు అండగా ఉంటాం ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే అంతవరకు ఉద్యమాన్ని ఉద్రిక్తత చేస్తాం.మహిళా సంఘాల అభివృద్ధి లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వివోఏల పట్ల ప్రభు త్వం నిర్లక్ష్య ధోరణి వీడి వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం ముందు ఉంచిన పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారి అభి వృద్ధికి తోడ్పడాలి. పని ఒత్తిడి తగ్గించాలి. విధులకు సమ యపాలన కేటాయించాలి అర్హులైన వీవోఏలను సీఎలుగా నియమించాలి నేటి నుండి చేపట్టబోతున్న సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి :
వివో ఏల మండల అధ్యక్షురాలు దారం శ్రీలత ,గూడూరు
అంత కొన్ని సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహి స్తున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి పలుమార్లు డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ప్రయో జనం లేకపోయింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం అందజేయాలి.
మా బాధ్యతను ప్రభుత్వం గుర్తించాలి : వివోఏల మండల కోశాధికారి మల్లెబోయిన శ్రీలత అప్పరాజు పల్లి
గ్రామాలలో గ్రామైక్య సంఘాల అభివృద్ధిలో మా బాధ్యతను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. పని ఒత్తిడి తగ్గించి పనికి తగ్గ వేతనం అందజేయాలి ప్ర భుత్వం శ్రమను గుర్తించి వేతనం పెంచా లి సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి.