Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ పాఠశాలను తలపిస్తున్న వైనం
- విద్యార్థులకు అందుబాటులో సకల సదుపాయలు
- నేడు ప్రారంభించనున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని ఎర్రబెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో మాడల్ పాఠశాలగా ఎంపిక కావడంతో 16 లక్షల 52 వేల 182 రూపాయల నిథులతో పనులు పూర్తి చేసుకుని కార్పొరేట్ పాఠశాలను తలపించేవిధంగా కొత్తకళతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. తాగునీటి సౌకర్యానికి నిదులు రూ,262639, ఎలెక్ట్రిఫికేషన్కు రూ. 142558, పెయింటింగ్‌కు రూ. 413608, గ్రీన్ చాక్ బోర్డ్స్‌కు రూ. 81545, ఫర్నిచర్‌కు రూ.494264, మేజర్ అండ్ మైనర్ రిపైర్స్కు రూ. 257568 ఖర్చు చేసి సర్కారు పాఠశాలను సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగ తయారు చేసారు.
ప్రభుత్వ పాఠశాలల్లోచేర్పించేందుకు కృషి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఎర్రబెల్లి మాడల్ పాఠశాలగా ఎంపిక కావడంతో పనులు త్వరగా పూర్తి చేసాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎంపిపిఎస్ ఎర్రబెల్లిలో సదుపా యాలు కల్పించాం. తల్లితండ్రులు తమ పిల్లలని ప్రయివేట్ పాఠశాలకు పంపించి ఆర్థిక భారాన్ని మోయకూడదు. అన్ని సదుపా యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చేరేవిధంగా తల్లి తండ్రులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
-ఎస్ఎంసీ చైర్మన్ వి స్వాతి
అందరు కృషి చేయాలి
పాఠశాలలో అన్ని వసతులతో పాటు సుశిక్షుతులైన, అర్హత, అనుభవమున్న ఉపాద్యాయులతో ఇంగ్లిష్ మీడియం లో విద్యనందిస్తున్నాం. మన గ్రామంలోని ప్రతివిద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేవిదంగా అందరు కృషి చేయాలి. హెచ్ ఎం గణపతి నాయక్, ఉపాద్యాయబృందం కలిసి బడిబయట పిల్లలు లేకుండా, బడిఈడు పిల్లలు అందరు బడులలో ఉండేలా బాధ్యత వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది.
- మొగిలిచెర్ల శ్రీనివాస్, సిఆర్పి