Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిలీద్రం సోకి చనిపోతున్న చెట్లు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మానవాళికి ఎంతో ఉపయోగపడే వేప చెట్లు ఎక్కడికక్కడా ఎండిపోతున్నాయి.చిగర్లు,లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి.పూత,కాత కుళ్ళిపోతూ కొద్దిరోజుల్లోనే చనిపోతున్నాయి. ఫలితంగా వేప పుల్ల, వేప పువ్వు,కాయల కోసం ఆందోళన మొ దలైంది. రెండేళ్లుగా వేపచెట్లు ఎండిపోవడమో, కూలిపో వడమో జరుగుతుండగా కొద్దీ రోజులుగా తీవ్రంగా కనిపిస్తోంది. దీనికి కారణమైన తెగుళ్లను గుర్తించి వేపచెట్లను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్వరోగ నివారిణి మనిషికి ప్రాణవాయువు అందిస్తూ వేపచెట్టు మనుగడ ప్రమాదంలో పడింది. మండలంలో పెద్దపెద్ద వేపచెట్లను , పోయెస్పిన్ అజాడిరిక్టె, అనే శీలిద్రం సోకి డై బ్యాక్ వ్యాధితో చనిపోతున్నాయని కొందరు, త్రి మస్కిటో బగ్ వల్లనే చనిపోతున్నాయని మరికొందరు శాత్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికె ప్రభుత్వం చెట్లను సామాజిక బాధ్యతగా కాపాడుకో వాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకు, రైతులు, ప్రజలకు పిలుపునిచ్చింది. మండలంలో మాత్రం ఆయా పక్షాల నుంచి స్పందన కరువైంది. అటవీశాఖ అధికారులు మాత్రం ఉన్నతాధికారులకు నివేదిస్తాం అంటున్నారు.
నివారణ చర్యలు ఇలా...
సమస్యను గుర్తించిన వెంటనే చెట్టును మొత్తం కొట్టివేయకుండా సదరు కొమ్మను నరికి వేయడం ద్వారా మిగతా శాఖలకు వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చని శాత్రసావేత్తలు అంటున్నారు.చెట్టుకు ఎక్కువ నీరు పోయడం, గోరింటాకు కలిపిన నీరు పోయడం ద్వారా వైరస్ ను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కార్బెండిజిమ్ (బావిస్థాన్) మందును లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోయాలి. వేర్లు, కాండంపై ఉండే శీలింద్రాన్ని ఈ మందు అరికడుతుంది. అనంతరం ఏడూ రోజుల తరువాత ద యోపనెట్ మితైల్ రెండు గ్రాముల మందు లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోయాలి.