Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అంటరానితనాన్ని రూపుమాపుతానని బిఆరెస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఒకే ఒక్క కుటుంబ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ లో అంబేద్కర్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటూ మంథని ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. ఎప్పుడైనా మీరు దళితులకు అన్నం పెట్టారా అని ప్రశ్నించారు. అంబెడ్కర్ విగ్రహానికి ముట్టే అర్హత లేదని ప్రజలతో ఓట్లు వేసుకుని అంటరానితనం పాటిస్తే ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు. సామాన్య కార్యకర్తలకు పదవులు కల్పించిన ఘనత తమదే అన్నారు. మహాదేవపూర్ మండలానికి మూడుసార్లు మార్కెట్ కమిటీ,కాళేశ్వరం దేవస్థాన చైర్మన్, పదవి ఇచ్చామని ఇదే కాకుండా డైరెక్టర్లుగా చాలా మందికి పదవులు కల్పించానని అన్నారు . ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మహాదేవపూర్ ఆసుపత్రిని అనేకసార్లు సందర్శించి వైద్యులను నియమించి ప్రజలకోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లానని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించిన దాఖలాలు లేవని అన్నారు. రాబోయే రోజుల్లో నాయకులు కార్యకర్తలు కష్టపడాలని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, హనుమకొండ జెడ్పీ చైర్ పర్సన్ భూపాలపల్లి అధ్యక్షురాలుగండ్ర జ్యోతి, పార్టీ నాయకులు కరు నాగయ్యచ ఎంపీపీ బి రాణి బారు, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమతమనోహర్, సర్పంచి శ్రీపతి బాపు, నియోజకవర్గ మహిళాబీసీ మహిళా అధ్యక్షురాలు గీతాబాయి, మండల అధ్యక్షురాలు సప్న మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ బండం లక్ష్మారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అలిమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.