Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జెడ్పి వైస్‌చైర్మన్ బడే నాగజ్యోతి
నవతెలంగాణ- తాడ్వాయి
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బడి నాగజ్యోతి అన్నారు. ఆదివారం మండలంలోని బయ్యక్కపేట, వెంగలాపూర్ గ్రామా లలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్ల య్య పార్టీ శ్రేణులతో కలిసి వారి వారి గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. బయ్యక్కపేటలో క్రీడాకారులకు వాలీ బాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థా యిలో మరింత బలోపేతం చేసేదిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపె ట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఆర్ ఎస్‌లో గుర్తింపు ఉంటుందని, రాబోయే రోజుల్లో పదవులు తప్పక వర్తిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు గడ్డం అరుణ, బయ్యక్కపేట సర్పంచ్ గుర్రం రమాసమ్మి రెడ్డి, జాగతి జిల్లా మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, వసంతరావు, యూత్ నాయకులు కోట సురేష్ అల్లం రవి సురేష్, నాగమ్మ, ప్రవీణ్ రెడ్డి, కందుకూరి సమ్మయ్య టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.