Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
గుర్రు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో ఇందారపు మొగిలి అనే రైతుకు చెందిన రూ.40వేల విలువగల ఆవు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం చోటుచేసుకుంది. ఆవు యజమాని పూర్తి కథనం ప్రకారం శనివారం అవును మేతకు వదిలిపెట్టినట్లుగా సాయంత్రం అయినా ఇంటికీ రాలేదని తెలిపాడు. ఆవు కోసం ఆదివారం వెతుకుతున్న క్రమంలో గ్రామ శివారు పొలాల్లో కొన ఊపిరితో కొట్టుకుంటూ నొట్లో నుంచి నురుగులు రావడం గమనించి చికిత్స చేయించిన ఫలితం దక్కలేదని బాధిత రైతు కన్నీరుమున్నీరైయ్యారు. ఆర్థికంగా రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.