Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ఉద్యోగుల పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ విజయవంతం అయ్యిందని, ర్యాలీ కి ఉప్పెనలా ఉద్యోగులు పాత పెన్షన్ నినాదాలతో మారుమోగిం దని టీఎస్సీపీిఎస్ఈయు హనుమకొండ ,వరంగల్ జిల్లాల అధ్యక్షులు కందుల జీవన్ కుమార్ యాదవ్, కొంపల్లి రవీందర్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీఎస్సీపీఎస్ఈయూ హనుమకొండ , వరంగల్ జిల్లాల భాద్యుల ఆధ్వర్యంలో 3000 పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులతో పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్‌ను ఆదివారం వరంగల్ ఎంజీఎం నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించి విజయ వంతం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వ యకర్త డాక్టర్ కె వెంకటస్వామి పాల్గొని మాట్లా డుతూ ఇప్పటివరకు టీఎస్సీపిఎస్ఈయు ద్వారా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్యామిలీ పెన్షన్ గ్రాటిట్యూటీ సాధించుకున్నామన్నారు. త్వరలోనే పాత పెన్షన్ సాధించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజీవో అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, ప్రవీణ్ హాజరై మాట్లాడుతూ సిపిఎస్ రద్దయ్య వరకు టీఎస్ సీపీఎస్ ఈ యు కు పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఎస్టీయూ, డీటీఎఫ్, టీపీటీఎఫ్, జిటిఏ హన్మకొండ వరంగల్ జిల్లాల బాధ్యులు ఆట సదయ్య, వి రాంబాబు , శ్రీనివాస్ రెడ్డి తిరుపతి, పి.వీరాచారి పాల్గొని మాట్లాడుతూ పాత పెన్షన్ సాధన కోసం తమ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీనివాస్, శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలు ఓపిఎస్‌ను ఇచ్చాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. మెడికల్ అండ్ హెల్త్, జిడబ్ల్యూఎంసి,ఇరిగేషన్, ఆర్అండ్బి, ఎన్సిసి, కుడా ఆఫీస్,ఎడ్యుకేషనల్, రెవెన్యూ, ట్రెజరరీ, అగ్రికల్చర్, కోపరేటివ్ సొసైటీ ,బ్లైండ్ అండ్ డమ్ అసోసియేషన్ వివిధ శాఖల నుండి 3000మందికి పైగా ఉద్యోగులు ర్యాలీని విజయవంతం చేశారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల నుండి,వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల మద్దతుతో అధిక సంఖ్యలో ఉద్యోగ ,ఉ పాధ్యాయులు ,రాష్ట్ర బాధ్యులు షేక్ అప్జల్, డా అన్వర్, లింగమూర్తిగారు బుచ్చన్న, నర్సమ్మ , జ్యోతి, డాక్టర్ రఘుపతి,హరికుమార్, రాజేందర్, నాగరాజు, శివకోటి, డాక్టర్ అన్వర్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ శిరీష్ డాక్టర్, కరుణాకర్ హేమలత ,ఉమాదేవి, సురేందర్ రెడ్డి,రవి, కుమారస్వామి, రాజు, ఆనంద్ కుమార్, రామకృష్ణ, అభి, రాజమౌళి వివిధ సంఘ బాద్యులు పాల్గొన్నారు.
ఉద్యోగుల భద్రత ప్రభుత్వాలదే బాధ్యత
నవతెలంగాణ - ములుగు
ఉద్యోగుల భద్రత ప్రభుత్వాలదే బాధ్యత అని వక్తలు అభిప్రాయపడ్డారు. ములుగు లో టిఎస్సిపి ఎస్ఈయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నవరం రవికాంత్ మంకిడి రవి ఆధ్వర్యంలో ఆదివారం పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సిపిఎస్ రద్దు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు తప్పదని పెన్షన్ బిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని అన్నారు. వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ మడుగురి నాగేశ్వరరావు, టిడబ్ల్యూటియు రాష్ట్ర అధ్యక్షులు పోదెం కృష్ణ ప్రసాద్, పిఆర్టియు జిల్లా జనరల్ సెక్రెటరీ యాకుబ్‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, డిటిఎఫ్ జిల్లా జనరల్ సెక్రెటరీ రేగ నరేంద్ర కుమార్, ఎస్టియు జిల్లా అధ్యక్షులు మధుసూదన్, టిటియు జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్, అర్యు పిపిఎస్ జనరల్ సెక్రెటరీ జెట్టి సుభాష్,నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కిర్మాని, ఆదివాసి ఉద్యోగ సంఘ నాయకులు అన్నవరం వెంకటేశ్వర్లు,స్వప్న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు కలాలి మొగిలి, బోడ కుమార్, వనజ, సిపిఎస్ ఉద్యోగ సంఘ నాయకులు వినాయక్ , నరేష్, బిక్షపతి,మహి పవన్, అనసూర్య, పిఆర్టియు ములుగు వెంకటాపూర్ మండల అధ్యక్షులు కంచు ప్రభాకర్ శ్రీరంగం ,ఏటిఏ జిల్లా కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, టిపిటిఎఫ్ మండల కార్యదర్శి మంకిడి శ్రీనివాస్, అగ్రికల్చర్ సంఘం నాయకులు గోపాలరావు పాల్గొన్నారు.