Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్లి
నవతెలంగాణ -హన్మకొండ
హనుమకొండలో బీజేపీ చేసింది నిరుద్యోగ మార్చ్ కాదని, అది బీజేపీలోని నిరుద్యోగులంతా ఉద్యోగాల కోసం చేసిన మార్చ్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వారు మాట్లాడారు. శనివారం బిజెపి నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లో ఒక్క నిరుద్యోగి అయిన పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. 10వేల మంది నిరుద్యోగులతో మార్చ్ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికారని 10రోజుల నుంచి కాక తీయ యూనివర్సిటీతో పాటు కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు తిరిగారని నిరుద్యోగులను మార్చ్‌కు రావాలని బతిమిలాడారని ఎద్దేవా చేశారు. తీరా చూస్తే యువతి, యువకులు బీజేపీ పార్టీని చీదరిం చుకున్నారని, ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదని అన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాలు, అసత్యపు ఆరో పణలు, అబద్ధపు హామీలను రాష్ట్ర యువత నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. రాజకీయ లబ్దికోసం శవాల మీద పేలాలు ఏరుకునే రకం బీజేపీ అని అన్నారు. మూడు గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని చెప్పి సాయంత్రం ఆరున్నర అయినా 500మంది కూడా రాకపోతే హరిత హౌటల్లో ఉండి తొండి సంజరు ఆదేశిస్తే నయిమ్ నగర్ లోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులను నిరుద్యోగ మార్చ్‌కు తరలించిన నీచులు బీజేపీ నాయకులని ఆరోపించారు. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో నివసించే అడ్డా కూలీలను నిరుద్యోగ మార్చ్‌కు తీసుకువచ్చారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగ నియమాకాలు చేయాలని నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే పేపర్లు లీకేజీ చేస్తున్న కుట్రదారులు బీజేపీ నాయకులే అని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్లు మొదలుకుని పదవ తరగతి పరీక్ష పత్రం వరకు లీకేజీ చేసిన దరిద్రులు బీజేపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆలోచించాలని పద వులు రావాలంటే ప్రజల హదయాలను గెలుచు కోవాలి అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, నీచపు పను లు, పేపర్ లీకేజీలు, అబద్దాలు, అసత్యపు ఆరో పణలు చేస్తే పదవులు రావు, ప్రజలు ఆదరించరని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారన, ఇపుడు బండి 2లక్షల ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నారని అఆన్నరు. ముందు ఢిల్లీ లో మోడీ ఇంటి ముందు మార్చ్ చేసి ఖాళీ ఉన్న కేంద్ర ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడాలని అన్నారు. ఛాన్స్ దొరికితే ప్రభుత్వ అస్తుల అన్నీ అమ్మేదామనుకుంటున్న మోడీ వారసులుగా మీకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. దమ్ముంటే బిజెపి చర్చకు రావాలని ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం ఎన్ని భర్తీ చేసింది రాష్ట్రం ఎన్ని భర్తీ చేసింది తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.
బండికి ఇపుడు ఎంపీ పదవి ఉంది.. ఎన్నికల తర్వాత అది కూడా ఊడుతుందని రాజకీయ నిరుద్యోగిగా మారడం ఖాయం అని హితవు పలికారు. అపుడు మరిన్ని మార్చ్‌లు చేసుకోవచ్చని తెలిపారు. బండి కంటే బుద్ధి లేదని, ఈటెలకు ఏమైందన, మంత్రిగా ఉండి ఉద్యోగాల భర్తీ పై గొప్పగా మాట్లాడిన ఈటెల ఇపుడు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటారా అన్నారు. ఈటెల కేసీఆర్ ఫ్యూజ్ పీకడం కాదని, ఈటెల కే బీజేపీలో ఫ్యూజ్ పీకేసే పరిస్థితి ఉందని అన్నారు. ముందు హుజురాబాద్ లో ఈటెల ఓటర్లు ఫ్యూజ్ పీకేస్తామంటున్నారని అన్నారు. ఆ విషయం చూసుకుంటే మంచిది అని హితువు పలికారు.