Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
ఒట్లప్పుడు వచ్చే రాజకీయ నాయకున్ని కాదని నా బలం నా బలగం కార్యకర్తలే అని వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారం హన్మకొండ హంటర్ రోడ్ లోని అభిరామ్ గార్డెన్స్ లో 30, 31 డివిజన్ల బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస్యం మాట్లాడారు. నేను నా నియోజక వర్గ కార్యకర్తలకు, ప్రజలకు అన్నగా తోడుంటా అన్ని వేళలా అండగా నే నుంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటా అని, కేవలం ఓట్లప్పుడు వచ్చే రాజకీయ పార్టీ నాయకున్ని కాదని, నిత్యం మీతో ఉంటూ, మీలో ఒకడిగా ఉంటానన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని అన్నారు. కానీ నాడు నియోజకవర్గ మొత్తానికి కేవలం ఐదు కో ట్ల నిధులు కూడా రాని పరిస్థితి ఉండేదని నేడు వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివద్ధి పథం లో తీసుకెళుతున్న అని తెలిపారు. పశ్చిమ నియోజక వర్గ పరిధిలో అన్నిరకాల, అన్నివర్గాల ప్రజలు ఉంటా రని అన్నారు. రాజకీయం చేయడానికి కొందరు నా యకులు వస్తున్నారని, అలాంటి నాయకులు వరద లు, వానలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని అడి గారు. గత ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల అ యిపోయినాక కనుమరుగయ్యారని తెలిపారు. తా ను మాత్రం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మ ధ్య ఉన్నానని స్ప ష్టం చేశారు. కేసీ ఆర్, పార్టీపై ఈ డివిజన్ ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. తెలం గాణ ప్రభుత్వం వ చ్చాక అనేక సంక్షే మ అభివృద్ధి కార్య క్రమాలు చేపట్ట డం జరిగిందని వి వరించారు. నగర జనాభా అధికంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలోనూ రైతుబంధు రైతు బీమా వంటి పథకాల అమలవుతున్నాయని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి వంటి వినూత్న కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుం బాలకు సైతం అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చే శారు. పేదలకు గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్ర భుత్వం తరపున పట్టాలు అందిస్తానని అన్నారు. జి ల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి అర్హులైన వారికి పట్టాలు అందిస్తానన్నారు. డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ పార్టీ ద్వారానే లబ్ది పొందిన వారు ఉన్నారని శాంపేటలోని ఆటో యూనియన్‌కి కొంత సమస్య ఉన్నదని వారికి మా శ్రీచక్రఆటో యూని యన్ తరపున సాకరాల అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం 30 31 వ డివిజన్లోని 11,01276 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ లబ్ధి దారులకు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ బాబు, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ బా బు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.