Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువు శిఖంలోనే అక్రమంగా ట్రెంచ్కొట్టిన ప్రైవేట్ సర్వేయర్
కొనసాగుతున్న అక్రమ కట్టడాలు
- అడ్డుకున్న ఐబీ అధికారులు
- కలెక్టర్‌కు శాటిలైట్ మ్యాప్ నివేదిక అందజేసిన ఐబీ శాఖ
నవతెలంగాణ-హసన్‌పర్తి
హసన్‌పర్తి మండలం భీ మారం శ్యామల చెరువు కబ్జా ప ర్వం కొనసాగుతోంది. కొంత మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెరువును చేరపట్టి లూటీ చేసేందుకు కు ట్రలు పన్నుతున్నట్లు గ్రామస్తు లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమం లోనే గ్రామస్తుల ఫిర్యాదు మేర కు ఐబీ డీఈ రాజు, ఏఈ శ్రీని వాస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెరువు స్థలానికి డిజీ పీఎస్ (గూగుల్) సర్వే నిర్వహిం చి చెరువు విస్తీర్ణం, ఎఫ్ టీ ఎల్, బఫర్‌జోన్ హద్దులు నిర్ణయించి కలెక్టర్ కు నివేదిక అందజేశా రు. భీమారం శ్యామల చెరువు సర్వే నెంబర్ 642 లో 67-22 ఎకరాల విస్తీర్ణం. కాగా ఇంకా ఎఫ్టీఎల్ విస్తీర్ణంతో పాటు 30మీటర్ల బఫర్‌జోన్‌కు మొ త్తం కలిపి 99 ఎకరాలు ఉం టుందని ఐబీ అధికారులు తమ నివేదికలో వెల్లడించింది. అయి తే ఈ నివేదిక కలెక్టర్ పరిశీలన లో అందగానే కొంత మంది క బ్జాదారులు ప్రైవేటు సర్వేయర్ తో చెరువు స్థలంలో తప్పుడు ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించి ట్రెంచ్ కొట్టడంతో స్థానికులు ఐ బీ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఐబీ డీఈ రాజు, ఏఈ శ్రీని వాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత వ్యక్తులను అడ్డుకున్నారు. చెరువు స్థ లంలో అక్రమ నిర్మాణాలు చేపదితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చ రించారు. భీమారం చెరువు స్థలంలో కట్ట కింద ఇప్పటికే 8 గహాలు, చెరువులోని 74 గహాలు అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు చెబుతున్నారు. చెరువుస్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తే ఎంతటివారైన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.