Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-నర్సంపేట
పేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇ చ్చేదాక పోరాటాలు చేపడుతామని సీపీఐ(ఎం) జిల్లా కార్య దర్శి చింతమల్ల రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సీపీఐ (ఎం) చెన్నారావుపేట నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వ ర్యంలో సోమవారం ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన చేప ట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుటధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ చెన్నారావుపేట మండ లం లింగగిరిగ్రామంలో, సర్వే నెంబర్ 289/1లో నర్సంపేట పట్టణంలోని కాకతీయ నగర్ శివారు 601/1 ప్రభుత్వ భూ ములలో పేదలు వేసుకున్న గుడిసెలపై నివేశన పట్టాలి ఇ వ్వాలన్నారు. చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామం లో పేదలు ప్రభుత్వభూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తు న్న పరిస్థితి ఉంది అనేక ఇబ్బందులకు గురవుతూ గుడిసెల్లో నివసిస్తున్నారన్నారు. వారికి కనీససౌకర్యాలు లేక నానావస్థ లు పడుతున్నారని తెలిపారు. నర్సంపేట పట్టణంలో పేద లు రెండున్నరేళ్లుగా సర్వే నెంబరు 601/1 ప్రభుత్వ భూము లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని ఇక్కడఅనేక ఇ బ్బందులను ఎదుర్కొంటున్నాని ఆందోళన వ్యక్తం చేశారు. అ ర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏళ్లుగడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూ డా ఇచ్చిందిలేదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో వేలాది మంది పేదలు ఇంటి స్థలాలు లేక అద్దెఇండ్లలో ఉంటూ తీవ్ర ఇక్కట్ల పాలైతున్నారని అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని శంకుస్థాప న చేసి ఎనిమిదేండ్లు గడిచిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పేదలు ఇంటి స్థలాలు ఉన్నప్పటికీ వారికి ఇళ్లు నిర్మించుకొనే స్థూమతలేని స్థితి ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు పూరి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పరిస్థితి ఉందన్నారు, మొదటగా ఇంటి స్థలం ఉన్న వారికి రూ.ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో రూ.మూడు లక్షలు మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రూ.5లక్షలు కే టాయించాలన్నారు. నర్సంపేట పట్టణంలో పేదలు చాలా ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని వారికి కనీస సౌకర్యాలు అయినటువంటి పరిస్థితి ఉందని అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం బాధ్యతారాహి త్యమన్నారు. ఇప్పటికైనాపేదలు వేసుకున్నటువంటి గుడిసె ల స్థలంలో కనీస సౌకర్యాలు కల్పించి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టివ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని ప్రజా స మస్యలు పరిష్కరించాలని లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీవ్రస్థాయిలో పోరాటాలు చేపట్టాల్సి వస్తుం దని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అం దజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ స భ్యులు నమిండ్లస్వామి, హన్మకొండ శ్రీధర్, చెన్నారావుపేట మండల నాయకులు మొగులోజు శారద, నర్సంపేట పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఎండి ఫరిదా, వజ్జంతివిజయ, బిట్ర స్వప్న, కలకోట అనిల్, జగ న్నాధం కార్తీక్, తాళ్లపెల్లి ప్రవళిక, ఎస్ బాబు, ఇంద్ర, నాగ మణి, విలియం కేరి, ఈ బాబు,కుక్కల సదయ్య, బషీకే అలి వేలు, బర్ల అలివేలు, మాదారపు దేవేందర్, చీకటి కవిత, క ట్కూరి స్వప్న, సుభద్ర, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవా డికి పట్టాలు ఇవ్వాలని పేదలు నిర్మించుకున్న స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టే ప్రసక్తి లేదని సిపిఎం మండల కా ర్యదర్శి నమ్మిండ్ల స్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో లింగగిరిలో గుడిసెలు వేసుకున్న నిరుపేద కు టుంబాలతో నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. దళితులు గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. తొమ్మిదేళ్లుగా పేదలను మభ్యపె డుతూ పబ్బం గడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గద్దె దిం పాలన్నారు. పేదల కోసం కొట్లాడే ఏకైక పార్టీ ఎర్రజెండా పా ర్టీ అని రాష్ట్రంలో ఇల్లు జాగలేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు జాగ వచ్చేంతవరకు ప్రజా పోరాటం ఆగదని ఓటుకు నోటు కాకుండా ప్రజల కోసం పోరాడే పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ధరలు పెంచుతూ పేదోని వంచిస్తూ కా ర్పోరేట్లకు దేశాన్ని అమ్ముతున్న మోదిని తీవ్రంగా వ్యతిరే కించారు. వానకు తడిసి ఎండకు ఎండైనా సరే ఈ భూమిని సాధించేంతవరకు ఇక్కడి నుంచి అడుగు బయట పెట్ట కండి అని ధైర్యం చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఆశలు చూపుతూ కాలంవెళ్లదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించా రు. ఇకనైనా పేదల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.