Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 కోట్ల నగదుతో పాటు పురస్కారం అందుకున్న ములుగు అధికార ప్రతినిధులు
నవతెలంగాణ-ములుగు
సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతాత్ వికాస్ పురస్కార్ ఇటివల ములుగు జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సందర్భంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు గిరిరాజ్ సింగ్ చేతు ల మీదుగా పురస్కారంతో పాటు3 కోట్ల నగదు పారితోషకం జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలతో కలసి సోమవారం అందుకున్నారు. ఈ కార్యక్రమములో డిపిఓ వెంక య్య, డిఎల్పిఓ దేవరాజ్లు కుడా పాల్గొన్నారు.
అధికారులను అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా పంచాయతీకి నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం దక్కడం పట్ల రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతాత్ వికాస్ పురస్కారం కోసం దేశంలో మూడు జిల్లాలను ఎంపిక చేయగా అందులో ములుగు జిల్లాకు రెండో స్థానం దక్కిందని మంత్రి పేర్కొన్నా రు. దేశంలోని 766 జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ అవార్డులో పాల్గొనగా వాటి ప్రదర్శన ఆధారంగా ములుగు జిల్లా జాతీయ స్థాయి లో ఉత్తమ పంచాయతీల జాబితాలో రెండో స్థానంలో నిలవడం ఎంతో గర్వకార ణం అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ.3 కోట్ల నగదు పారితోషకాన్ని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలతో కలిసి అందుకోవడం హర్షణీయమన్నారు. భవిష్యత్లో మొదటి బహుమతి పొందే విధంగా కృషి చేయా లని అధికారుల్లో మంత్రి స్ఫూర్తి నింపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, మిషన్ భగీరథ ఫలితాలతోనే పంచాయ తీలకు జాతీయ స్థాయి అవార్డులు వరించాయని మంత్రి తెలిపారు.ఈ సందర్భం గా మరోసారి మంత్రి సత్యవతి రాథోడ్ ములుగుజిల్లా అధికారులను అభినం దించి, శుభాకాంక్షలు తెలిపారు.