Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
పట్టణంలో ఇల్లులేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ సీపీఐఆధ్వర్యంలో సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరుపేదలు ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ జనగామ పట్టణంలో దీర్ఘకాలంగా వేలా ది మంది నిరుపేదలు కిరాయిలకుంటూ తమ జీవనం గడుపుతున్నారని, అలాం టి వారి పక్షాన నిలిచిన సీపీఐ అనేకమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్‌లు చేశామని, లబ్ధిదారుల దరఖాస్తులతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎమ్మా ర్వోలకు వ్యక్తిగత దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. జనగామలో పేదల కోసం సుమారు 35 ఎకరాల స్థలమును షామీర్ పేట శివారులో కొనుగోలు చేసి ఇప్ప టికీ అందులో నుండి మొదటి విడత రెండో విడత కొందరికి మాత్రమే కానీ ఇంకా 600 డబ్బులు బెడ్ రూములు ఉన్న ఇప్పటివరకు వాటిని పూర్తి చేయకుండా లబ్ధి దారులకు అందించకుండా కాలయాపన చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. మిగతా 16 ఎకరాల్లో ఖాళీ స్థలంలో ఇప్పటికే పట్టాలు ఇచ్చిన వారికి స్థలం అప్పగించి మిగతా భూమిలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్లా నంబర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న భూమిలో రిక్షా కార్మికులకు, హమాలీ కార్మికులకు, రైస్ మిల్ కార్మికులకు పట్టాలు ఇచ్చిన ఇంతవరకు వారికి భూమి అప్పగించకపోవ డాన్ని సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రభుత్వం ఇలానే కాలయాపన చేస్తూ పోతే ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం ఉన్న అక్కడికెళ్లి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తా మని, లేని వాళ్ళందరికీ గుడిసెలు వేయించి తీరుతామని రాజారెడ్డి హెచ్చరించా రు. ఇండ్ల స్టలాల సమస్యలతో పేదల మధ్య ఎలాంటి సమస్యలు సృష్టించకూడద ని, వారిని రెచ్చగొట్టే విధంగా ఎవరూ మాట్లాడవద్దని, అందరికీ వచ్చే విధంగా కలిసి పోరాటం చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని రాజారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణమ్మ, జిల్లా నాయకులు ఆది సాయన్న, మంగళంపల్లి జనార్ధన్, చొప్పరి సోమయ్య, చిం త కింది అరుణ, పాతూరి ప్రశాంత్, కేమిడి మల్లయ్య, మోటి శ్రీశైలం, చల్లోజు మల్లేశం, గుంటి కుమారస్వామి, పండుగ నిర్మల, గుగులోత్ సఖి, సీతారాం నాయక్, గోల్కొండ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.