Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు
వివోఎలా సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలను ఉదతం చేస్తామని సీపీఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, సీఐటీయూ మండల కార్య దర్శి ఈసంపల్లి సైదులు, వివోఎల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు మండల వివోఏలు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమా న్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కార్మిక సం ఘాల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మండలాలలోని ఐకెపి సర్ఫ్ కార్యాలయంలో వివిధ గ్రామాల్లో వివోఏలుగా కొన్ని ఏళ్లుగా చాలీచాలని వేతనాల తో విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీవోఎల సమస్యలను తక్షణమే పరిష్కరించా లని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గ్రామాలలో మహిళా సంఘాల గ్రూపులను ఒకచోట వేదిక ఏర్పాటు చేసి వారి సమావేశాలు పెట్టి వారికి సంబంధిత రికార్డుల ను రాస్తూ తిరిగి గ్రూపు సభ్యులకు బ్యాంకుల ద్వారా మహిళాభివృద్ధి కోసం ప్రభు త్వం అందించే లోన్లను ఇప్పిస్తూ ఏ సంఘం మహిళా సభ్యురాలు కట్టనియెడల వారికి సమావేశం నిర్వహించి రికవరీ చేయించేది కూడా వివోఏలపనే అన్నారు. వీరితోపాటు ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే వాటి గ్రామంలో గడపగడపకు చేరేందుకు వీరు కూడా కృషి చేస్తున్నారని అలాంటప్పుడు ఇంత పని చేయించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వీరికి వేతనాన్ని 26 వేల రూపాయలు తక్ష ణమే అందించి వారిని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించి అర్హు లైన వారిని పదోన్నంతలుగా సీసీలుగా కల్పించే అవకాశం ప్రకటించాలన్నారు. వారి కుటుంబ సభ్యులను కాపాడి ప్రభుత్వ సహకరించాలని అన్నారు. లేనియెడల పోరాటాలను ఉధృతం చేసి అనేక రకాలుగా ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లం ఎల్లయ్య. ఐకేపీ వీవోఏల సంఘం మండల గౌరవ అధ్యక్షు లు బిర్రు యాకయ్య, మండల అధ్యక్షుడు హనుమంతు, సమ్మె కార్యక్రమం ఇన్చార్జి ఇందిరా, మంజుల, అశోక్ గౌడ్, శ్వేత, హైమవతి, కవిత, ఉష, ఉపేందర్, విజయ లక్ష్మి, వివిధ గ్రామాల సిఏలు తదితరులు పాల్గొన్నారు.