Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి : సీపీఎం
- అక్రమ స్వాధీనం సరైంది కాదు వెంటనే ఖాళీ చేయాలి : తహసీల్దార్
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తయి రెండు సంవత్స రాలు గడవడంతో మండలంలోని గూడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేద లు స్వాధీనం చేసుకున్నారు. అర్హులైన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మండలం లోని గూడూరులో నిర్మించిన 70 ఇండ్లు రెండు సంవత్సరాల క్రితం పూర్తి కావడం తో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దర ఖాస్తులు చేసుకున్న పేదలు రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ నిరాశకు గుర య్యారు. దరఖాస్తులు చేసుకున్న పేదలు గుడిసెల్లో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తులు చేసుకున్నప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకుండా కాలయాపన చేయడంతో పేదలు సోమవారం ఉదయం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు ఉన్న తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారు. పేదలందరూ ముకుమ్మడి గా తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడడంతో స్థానిక ప్రజాప్రతినిధులు చూస్తూ నివ్వెర పోయారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్ ఇండ్లకు తాళా లు వేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రెండేళ్లుగా చూసినప్పటికీ ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో పేదలందరూ ఇళ్లలోకి చొరబడి స్వాధీనం చేసుకోవ డంతో మండలంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన గ్రామాలలో చర్చనీ యాంశంగా మారింది. ఇళ్లల్లోకి చొరబడిన పేదలు ఇండ్లు కేటాయించిన, కేటా యించకపోయినా ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. దరఖాస్తులు చేసుకొని ఇళ్ల ను స్వాధీనం చేసుకున్న పేదలకే ఇండ్లు కేటాయించాలని నిరుపేదలు ప్రభుత్వా న్ని, అధికారులను కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లన్నీ అర్హులైన పేదలకే ఇవ్వాలి
మాచర్ల సారయ్య, సీపీఎం మండల కార్యదర్శి
మండలంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు అర్హులైన పేదలకే ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ డబు ల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అధికారులు, ప్రజాప్రతి నిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ల కోసం పేదలు దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నారు. నిర్మించిన ఇండ్లను పేదలకు పంచకుంటే గూడూరు తరహాలోనే మండలంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలే స్వాధీనం చేసుకుంటారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలి
తహసీల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్
మండలంలోని గూడూరులో పేదలు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తీసుకుం టాం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న పేదల జాబితాను వారం రోజుల్లోగా పూర్తి చేస్తాం. ఖాళీ చేస్తేనే పేదలను గుర్తించి డబుల్ బెడ్రూం లో లబ్ధిదారులుగా ఎంపిక చేస్తాం. ప్రభుత్వం పంపిణీ కోసం ఎలాంటి అదేశాలు జారీ చేయనప్పటికీ గ్రామస్తు లు తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధం. ఇళ్లలోకి అక్రమంగా చొరబడిన పేదలు అధికారులకు సహకరించాలి.