Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ పార్క్ నిర్వహణ తీరుకు రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి అందుకోవడం అభినందించ దగిన విష యమని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే అనంతరం అవార్డ్ గ్రహీతలైన ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, రోడ్లు భవనాల శాఖ అధికా రి తానేశ్వర్, భూగర్భ జల శాఖ అధికారి సురేష్, జిల్లా అటవీశాఖ అధికారి తరపు న ఫారెస్ట్ అభివృద్ధి అధికారి కృష్ణమాచారిలను కలెక్టర్ శాలువా కప్పి సన్మానిం చారు.గత శనివారం రాత్రి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో జరిగిన ఉద్యానవన ఫెస్టి వల్లో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రైతు సమ న్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ఇదే స్ఫూర్తితో జిల్లా మరిన్ని అవార్డ్లు సాధించాలని, అధికారులు ఆ రీతి లో కృషి చేయాలన్నారు. అవార్డుకు ఎంపికైన ఉదంతాన్ని కలెక్టర్ వివరిస్తూ మొక్క లు నాటడమే కాకుండా, అయా స్థలాల్లో ఉన్న మొక్కలను తొలగించకుండా అం దంగా మలచుకోవడం, అన్ని రకాల మొక్కలు ఉండే విధంగా చూసుకోవడం, ఈ ఉద్యానవనంలో అతి తక్కువ నీటిని వినియోగించుకోవడం, నాటిన ప్రతి మొక్క అందంగా తీర్చి దిద్దడంతో అవార్డ్‌కు ఎంపికైనట్లు వివరించారు. పచ్చదనం పెం చడంతో కార్యాలయంకు వచ్చే ప్రజలు సేదతీరేందుకు పార్క్‌లాగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం చూపరులను ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు. పార్క్ నిర్వహణ బాధ్యతను ఏజెన్సీ వినోద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కలెక్టరేట్‌కు ఈ అవార్డ్ దక్కినట్లు తెలిపారు.