Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్
నవతెలంగాణ-ములుగు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కారిం చాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్, డిఆర్ఓ కే రమాదేవితో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిం చారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలను సత్వరమే పరి ష్కరించాలని, తిరస్కరించిన వాటికి సవివరమైన వివరణ ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ రోజు ప్రజావాణిలో మొత్తం (29) దరఖాస్తులు రాగా, అందులో (18) రెవెన్యూ శాఖకు, (3) 2 బిహెచ్ కే, (2) వివిధ రకాల పెన్షన్లు సమస్యలపై, (06) ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. స్వీకరిం చిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ ప్రజావాణి కార్య క్రమంలో జెడ్పి సీఈవో ప్రసూన రాణి, సిపిఓ ప్రకా ష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డివైఎస్ ఓ వెంకటరమణ చారి, డివిహెచ్ఓ విజయ భాస్కర్, డిసిఓ సర్దార్ సింగ్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డిడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీప తి, ఏటీడీఓ దేశి రామ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.