Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్
నవతెలంగాణ-ములుగు
ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని శిల్పం వర్ణం కృష్ణం పేరు తో యునెస్కో గుర్తింపు పొందిన రామలింగేశ్వర స్వామి (రామప్ప) దేవాలయం ప్రాంగణంలో మంగళవారం 18 తేదీన సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడతాయని, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్ కోరారు. సోమ వారం వెంకటాపూర్ మండలంలోని పాలంపేట (రామప్ప) దేవాలయం ప్రాంగ ణంలో ప్రపంచ వారసత్వ దినోత్సవాల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్,డిఆర్ఓ రమాదేవితో కలసి పర్శిలించారు.ఈ సందర్భంగా జిల్లా అద నపు కలెక్టర్ రెవెన్యూ వై.వి. గణేష్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్ట ర్ వి శ్రీనివాస్ గౌడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు,జిల్లా ఉన్నతాధికారులు అధి క సంఖ్యలో పాల్గొననున్నట్లు వివరించారు. ప్రపంచ వారసత్వ వేడుకలకు ములు గు జిల్లా వెంకటాపూర్ ప్రఖ్యాత రామప్ప దేవాలయం సిద్దమైనదని,18న శిల్పం వర్ణం కృష్ణం ఈ కార్యక్రమం జరుగునుందన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతో దేవాలయ ప్రాంగణం మారుమోగునందుని పలువురు సినీ ప్రము ఖులు కళాకారులు సందడి చేయనున్నారు. ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కళాకా రుల ప్రదర్శనలు ఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వైవి గణేష్ ప్రక టించారు.అరబీ ఇనిస్టిట్యూట్ వారి వాయిలిన్‌తో పాటు పేరణి నృత్యం రావణ టోల్ స్టోరీ ఆఫ్ ది 11 హెడ్ బెంగళూరుకు చెందిన సూర్య ఎస్ రావు హెరిటేజ్ ఆఫ్ ఇండియా శ్రావ్య మానస ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.ఈ కార్య క్రమం సందర్భంగా బలగం చిత్రంలోని నటులు పాల్గొననున్నారని తెలిపారు. ప్రజలు ఎక్కువ హాజరయ్యేందుకు రామప్ప దేవాలయానికి స్పెషల్ బస్సులు 18వ తేదీన ఉదయం నుండి హనుమకొండ, ములుగు నుండి కూడా ప్రత్యేక సర్వీసుల సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ విజయ భాస్క ర్, ఆర్అండ్బి ఈఈ వెంక, డిసిఓ సర్దార్ సింగ్, డిడబ్ల్యూఓ ప్రేమలత, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, బిసి వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, తహసిల్దార్ మంజుల, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.