Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ ప్రవీణ్ కు మార్ అన్నారు. సోమవారం మండలంలోని వనపర్తి గ్రామంలో వంగ వెంకటేశ్వ ర్లు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ అధ్యక్షతన శ్రీ కల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ కుట్టు మిషన్ ఎంతో ఉపయోగకరమని మా కుటుంబం ఎదుగుదలకు దోహద పడిందన్నారు. మహిళలకు శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సర్పంచ్ తెలిపా రు. ఎంపీటీసీ గోలి రాజరెడ్డి, మడుపు చంద్రయ్య దేవుడి మంజుల, శ్రీకల్ప ఆర్గనై జేషన్ వ్యవస్థాపకులు ఆలేటి కల్పలత శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీపై మహి ళలకు కుట్టు మిషన్లతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమగాని పద్మ, వంగ నిర్మల, వంగ ఉపేంద్ర, ధర్నా శ్రీదేవి, ఎండి హలీమా, టీచర్ దామెర పద్మ, లావణ్య మహిళలు పాల్గొన్నారు.