Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రజా వాణి చక్కని వేదిక అని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన ప్రజల నుండి విన తులను స్వీకరించి ప్రజా వాణిని నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తన భర్త మరణించినందున తనకు ఆసరా ఫింఛన్‌ను మంజూరు చేయాలని చిల్పూరు మండలం చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన చుక్క రమ ధరఖాస్తును అందజేశారు. తమ భూమికి సంబంధించిన రైతు బంధును అక్రమంగా మరో రైతు కాజేస్తున్నాడని, వెంటనే తగు చర్యలు తీసుకొని తమకు రైతు బంధు ఇప్పిం చాలని లింగాలఘణపురం మండలం నాగారం గ్రామానికి చెందిన 21 మంది బాధిత రైతులు అధికారులకు విన్నవించుకున్నారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా తాను చెప్పుల దుకాణం పెట్టుకున్నప్పటికీ నేటికి సబ్సీడీ రుణం మంజూరు కాలేదని, వెంటనే మంజూరు ఇప్పించాలని రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామా నికి చెందిన తురుగొండ యాదగిరి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని లింగాలఘణపురం మండలం పటేల్‌గూడెం గ్రామానికి చెందిన యాదమ్మ వినతిపత్రం అందజేశారు. మండలంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని బచ్చన్నపేట మండలానికి చెందిన క్రాంతి అధికారులను కోరారు. జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో విక్రయించే మందుల నా ణ్యతపై ప్రచారం చేయడమే కాకుండా రైతులకు అవగాహన కల్పించాలని తెలం గాణ రైతు కూలి సంఘం ప్రతినిధులు అధికారులను కోరారు. మొత్తం 57 విజ్ఞప్తు లు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒలు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్డిఎ పిడి రాం రెడ్డి, జెడ్పీ సిఇఒ వసంత, ఎన్పీడిసిఎల్ ఎస్సీ వేణు మాధవ్, జిల్లా వ్యవసాయా ధికారి వినోద్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి ఇస్మా యిల్, డిసిఒ కిరన్‌కుమార్, డిసిఎస్‌ఒ రోజారాణి, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, డిడబ్ల్యుఒ జయంతి, ఉద్యానవన శాఖ అధికారి లత, పరిశ్రమల శాఖ అధికారి రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్, ఎ.ఒ.మన్సూరలి, జనగామ తహశీల్దార్ రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.