Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-లింగాలఘనపురం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెంటనే కరెంటు, మంచినీటి సరఫరా సౌకర్యా లు కల్పించాలని కోరుతూ కెవిపిఎస్, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు.ఈసందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు తూటి దేవాదానం మాట్లా డుతూ గత ఎనిమిది సంవత్సరాల కిత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధి దారులకు పంపిణీ చేయడం లేదన్నారు. అర్హులైన పేదలకు ఎంపిక చేసి ఇండ్లు పంపిణీ చేయకుండా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తోందని విమ ర్శించారు. ఇల్లు లేని నిరుపేద ఏడాది నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తలదా చుకున్న వారి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉన్న కరెంటును,మంచినీటి సర ఫరా నిలిపివేత పై మండిపడ్డారు. లబ్ధిదారులతో తహశీల్దార్ కార్యాలయం ముం దు ధర్నా నిర్వహించారు. వివిధ డిమాండ్ కూడిన వినతిపత్రం తహశీల్దార్ అంజ య్య అందజేశారు. ఇప్పటికే నా అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. ఈకార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లలిత, సిపిఎం మండ ల కార్యదర్శి కరుణాకర్,నాయకులు అంజయ్య, శంకరయ్య, ఉప్పలయ్య, సూల్తాన, రవళి, లబ్ధిదారులకు తదితరులు పాల్గొన్నారు.