Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న
నవతెలంగాణ-మహబూబాబాద్
ఐకెపి వివో ఎలా సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న కోరారు.తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఏలు సమ్మె చేపట్టగా సోమవారం మానుకోటలో తహసిల్దా ర్ కార్యాలయం ముందు కృష్ణవేణి అధ్యక్షతన సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెను ఉద్దేశించి కుమ్మరి కుంట్ల నాగన్న మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇవ్వాలని కోరారు ఐకెపి వివోలను సర్ఫ్ ఉద్యోగస్తుల గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పిం చాలని10లక్షల సాధారణ భీమా ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా పత్తి నెల వేతనాలు వివో ఎలా వ్యక్తిగత ఖాతాలో చెల్లించాలని డిమాం డ్ చేశారు. వివోఏలతో ఆన్లైన్ పనులు చేయించకూడదని వివోఏలపైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎన్హెచ్జిలకు విఎల్ఆర్ అభ్యాసం డబ్బులు చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రాబోయే కాలంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పవన్, లలిత, రాజు, కవిత, శశికళ, ఉమా, తులసి, శిరీష, అక్బర్, వీరన్న, గోవర్ధన్, అనిత పాల్గొన్నారు.