Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ-చిన్నగూడూరు
వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఒక్కసారి నాకే అవకా శం ఇవ్వాలని అని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్నికి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు హాజరై య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానా యక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం ఒక దేవాలయం అని ప్రజలందరూ నాదేవుళ్ళని నేను ఒక ప్రజా సేవకుడుని అని అన్నారు. ఏడుసార్లు పోటీ చేస్తే ఆరుసార్లు గెలిపించారు అన్నారు. సభ వేదికపై నుండి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్న. సేవ చేసే భాగ్యం అందరికీ రాదు. మీ అందరి కృషి వల్లనే సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. మీ అందరి యొక్క బలంబలగంతో నన్ను గెలిపిస్తున్నారని అన్నా రు. నేను గెలిచాక 99 శాతం ప్రతి గ్రామానికి, తం డాకు తారు రోడ్లు వేశానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చి న హామీ ప్రకారం కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి డోర్న కల్ నియోజకవర్గం చివరి ఆయకట్టు వరకునీళ్లు అం దిస్తున్న అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజా ర్టీతో డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల కృషి చే యాలన్నారు. కేసీఆర్ వంటి విజ్ఞాన సంపద కలిగిన ముఖ్యమంత్రి ఉండడం అదృష్టం అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసే టోడు అని అన్నాడు. రాహుల్ గాంధీని సస్పెం డ్ చేస్తే టీపీసీసీ అధ్యక్షునిగా కనీసం నిరసన కార్యా చరణ ప్రకటించలేదని అన్నాడు. అదే నేను అయితే రాష్ట్రం మొత్తం హల్చల్ చేసేటోన్ని అని అన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఎన్ని డ్రా మాలు చేసిన వాళ్ల ఉనికి కోసమే తప్ప ఏం లేద న్నారు. ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రం ఆవిర్భవించి అతి తక్కువ కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ మాదిరిగా దేశం మొత్తం అభివృద్ధి జరగాలనదే బీఅర్ ఎస్ యొక్క ఉద్దేశం అన్నారు. ఎంపీ కవిత మాట్లాడు తూ ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ కుటుంబ సభ్యు లపై కుట్రపూరితంగా అనేక అక్రమ కేసులు పెడుతు న్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఐక్యమత్యం తో ఉంటు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా బీఅర్ఎస్ నాయకులు రవిచంద్ర, ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి మూల సునీత మురళీధర్ రెడ్డి, రైతు మండల కోఆర్డినేటర్ మంగ పతి రావు, జిల్లా రైతు సమితి సంఘం సభ్యురాలు అరుణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాంసింగ్, నాయకులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, చెన్నయ్య, చెన్నారెడ్డి, వైస్ ఎంపీపీ వీరయ్య, మండల కోఆప్షన్ సభ్యులు మోసిన్ బేగ్, ఉపేందర్, శ్రీరాములు, యూత్ అధ్యక్షుడు మురళి, సర్పంచ్ ఫో రం అధ్యక్షుడు మల్లయ్య, 10 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.