Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-బయ్యారం
ఇందిరా క్రాంతి పథకంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సిఐ టియు ఆధ్వర్యంలో ఐకెపి వివోఏల నిరవధిక సమ్మెను ఆయన ప్రారంభించి ప్రసం గించారు. డ్వాక్రా వ్యవస్థలో పునాది రాళ్లుగా పని చేస్తున్న ఐకేపీ వివోఎలు న్యాయ మైన కోర్కెలు పరిష్కరించాలని పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన ప్రభు త్వం స్పందించక పోవడం వల్లనే నిరవధిక సమ్మెకు దిగామని వివరించారు. విఓ ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు తగదని విమర్శించారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వ్యక్తిగత ఖాతాల్లోనే వేతనా లు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై జిల్లాలోని విఓఏలంతా సమ్మెకు కలిసి రావాలని, పట్టుదలగా పోరాడాలని ఆయన కోరారు. ఈ సమ్మెకు కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాణోత్ రాము నాయక్, సేవాలాల్ సేన నాయకులు భూక్యా రవి నాయక్ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న, నాయకులు వెన్ను మోహన్, రాము, విఓఏ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల వసంత, గొగ్గెల కష్ణకుమారి, నాయకులు జంపాల శ్రీనివాస్, భానోత్ లలిత, గుండగాని సతీష్, కొండ మహేశ్వరి, బాణోత్ సుజాత, కటకం పార్వతి, ఎస్కే ఆరిఫా, ఎల్లంకి భారతి, పద్మ, మంజుల, జానకి, సునిత, జీవిత, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వీకెేపీ విఓఏల సమస్యలను పరిష్కరించాలి : బానోత్ రామునాయక్
స్థానిక మెయిన్ రోడ్ దగ్గర వీకెపి విఓఏల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవ ధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజక వర్గ నాయకులు బానోత్ రాము నాయక్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సమస్యలపై పట్టించుకునే సమయం లేదా అని ప్రశ్నించారు. వీకేపి విఓఏల డిమాండ్స్ ఏదైతే ఉందొ వెంటనే పరిష్కరించాలని అన్నారు. అదే విదంగా వారికీ ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26000 రూపాయ లు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి వారికీ ఐడి కార్డు మరియు 10లక్షల ఆరోగ్య బీమాను కల్పించాలని డిమాండ్ చేశారు. వికేపి విఓఏలతో వెట్టిచాకిరీ చేయించుకొని వారికీ కనీసం భద్రత లేకుండా పోయిందని ప్రభుత్వం మీద మండి పడ్డారు. వారికీ ఎటువంటి కండిషన్లు లేకుండా విఓఏలతో ఆన్లైన్ పనులు చేయిం చకుండా చర్య తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అర్హులైన విఓఏలకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ విఓఏలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.