Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూపులు
- ఎండను సైతం లెక్కచేయని అన్నదాత
నవతెలంగాణ-పాలకుర్తి
గత పది రోజులుగా వరి కోతల్లో నిమగమైన రైతులు కోసిన ధాన్యాన్ని కల్లా లకు తరలిస్తున్నారు.కల్లాల్లో ధాన్యం రాశులునిల్వ ఉన్నప్పటికీ అధికారులు ధాన్యం కొనుగోల్లు చేసేందుకు నిర్లక్ష్యం చేయడంతో ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసిన రైతులు కొ నుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రబి సాగులో రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలో ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ కపోవడం శోచనీయం. కోసిన ధాన్యాన్ని రైతులు ఎండను సైతం లెక్కచేయకుండా గత పది రోజులుగా ఆరబెట్టుకుంటూ రాసులుగా పోయడం తలకు మించిన భా రంగా మారింది. జిల్లాలో సుమారు లక్ష 90 వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో రైతులు వరి కోతల్లో బిజీబిజీగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది. గత పది రోజుల క్రితమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ ప్రకటనను అమలు చేయడంలో అధికారుల జాప్యం ధాన్యం కొనుగో లు చేయకపోవడానికి నిదర్శనంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నేటి కీ కాంటాలు, పరదాలు, మాచర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు అందకపోవడం గమ నర్హం. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు శిక్షణ ఇవ్వకపోగా, కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగులు చేరకపోవడంతో కొనుగోలు కేంద్రాల పట్ల రైతుల్లో నిరాశ నిస్పహాలు నెలకొన్నాయి. మండే ఎండలో ధాన్యం రాశులను వెడల్పు చేసి ఆరబోయడం, ఆ తర్వాత రాశులుగా పోయడం భారంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుచున్నారు.
రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం : డిఆర్డిఓ రామ్‌రెడ్డి
జనగామ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 200 ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే నిర్వాహకులకు నేడు కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ ఇచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగులు, కాంటాలు, మ్యా చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లను అందించాం. రైతులు ఎవరు ఆందోళన చెంద వద్దు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. కొను గోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుం డా ఉన్న ధాన్యాన్ని మాత్రమే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు రైతులు సహకరించాలి.