Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 544 ఇండ్లను లబ్దిదారులకు లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు
- త్వరలో మరో 416 డబుల్ బెడ్ రూం ఇండ్ల అందిస్తాం
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
పారదర్శకంగా అర్హులకు లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నామని భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు ఎంపిక కాబడిన 544 మంది లబ్ధిదారుల సమక్షంలో డ్రా , లాటరీ ప్రక్రియ ద్వారా బ్లాక్, ఫ్లోర్ లను సోమవారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 100% సబ్సీడితో పూర్తి ఉచితంగా పేదలకు అందిస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే అభ్యంతరాలు తెలియజేస్తే విచారణ చేపట్టి ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం కలెక్టర్ వద్ద ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా బ్లాక్ లో ఫ్లోర్లలో ఇండ్ల కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మంచి రోజు తీసుకునే త్వరలో లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇంటిలో గహప్రవేశం చేయాలని ఆయన సూచించారు. భూపాల పల్లి పట్టణంలో మరో 416 ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని, త్వరగా ఆ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారుల ఎంపిక చేసి అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో రెండు ఫేస్ లలో 960 ఇండ్ల నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టిందని, వీటిలో 544 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసామని, మనకు వచ్చిన దాదాపు 5 వేల దరఖాస్తులలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేసి వాటిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 416 డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి మరో రెండు నెలల్లో వాటిని సైతం పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 544 లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు సైతం లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర , మున్సిపల్ కమిషనర్ పి అవినాష్, మున్సిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, బానోత్ రజిత జుములాల్ ,మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.