Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని దే శంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రా ష్ట్ర పంచాయతీశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ మరియు వరంగల్ జిల్లా శాఖల ఉమ్మడి సర్వసభ్య సమావేశం హనుమకొండలోని హరిత కాకతీయ లో మంగళవారం జరి గింది. ఈ సమావేశానికి టీజీవోస్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా, రాష్ట్ర నాయకులు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల పాత్ర, గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ గెజిటెడ్ అధికా రుల సంఘం 2008 లో ఏర్పడిందనిఈ సంఘాన్ని స్థాపించి, అధ్యక్షులుగా శ్రీని వాస్గౌడ్ ఎనలేని సేవలు అందించారని మలి విడత తెలంగాణ ఉద్యమంలో టిజిఓ సంఘం కీలక పాత్ర పోషించి ఎంతోమంది అధికారులు ఉ ద్యోగాలకు ఇబ్బందులు ఎదురైనా అప్పటి సమైక్య ప్రభుత్వాన్ని ధై ర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఉ ద్యోగుల పక్షపాతి తెలంగాణ వచ్చిన తరువాత 2015 లో దేశంలో ఎక్కడలేని విధంగా పిఆర్సి లో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని 2017 పిఆర్సిలో కమిటీ 7.5 శాతం సూచిస్తే, మన ముఖ్యమంత్రి గారు ఏకంగా పిఆర్సిలో 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరా లకు పెంచారని ప్రమోషన్లు పొందుటకు నిర్దేశించిన మూడేళ్ళ కాలాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించినారు.రిటైర్డ్ ఉద్యోగులకు క్వాంటమ్ అఫ్ పెన్షన్ను 75 ఏళ్ల నుండి 70 ఏళ్లలకు తగ్గించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హోమ్ గార్డులు, ఆశ వర్కర్లు, గ్రామ సేవకులకు అందరికి 30 శాతం ఫిట్ మెంట్ అందించినారు.అన్ని శాఖల్లో పదోన్న తులు కల్పించారు. దానికీ ఉ దా హరణ మా పంచాయతీ రాజ్ శాఖ, ఐకేపి (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పే స్కేల్ ఇచ్చినారని ఇది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, ఇంకా ఏమైనా మిగిలిపోయిన స మస్యలు ఉన్నా గౌరవ ముఖ్య మంత్రి పరిష్కరిస్తారని హామీ ఇ చ్చారు. ఈ సర్వసభ్య సమావేశా నికి హన్మకొండ, వరంగల్ జిల్లా లకు చెందిన అన్ని శాఖల గెజిటెడ్ అధికారులు, ఎన్నమ నేని జగన్ మోహన్రావు తదితరులు హాజరయ్యారు.