Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి పరికి మధు
నవతెలంగాణ-నర్సంపేట
గొర్రెల పంపిణీ పథకంలో అమలులో అవినీతిని నియంత్రించాలని గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ కోరారు. మంగళ వారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గొ ల పంపిణీ పథకంలో అవినీతి చోటుచేసుకుంటుందన్నారు. కడప, చిత్తూరు, కర్ణాటక నుంచి కొనుగోలు చేయాలని నిర్ణంచిందని దీనివల్ల ఎండ తీవ్రతకు ప్రయాణంలో గొర్రెలు మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లబ్దిదారులు తమకునచ్చిన చోటనే కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలన్నారు. లేక పోతే గొర్రెలు బదులు నగదు బదిలీ ద్వారా అమలు చేయాలన్నారు.
ఈ పథకం అమలకు గ్రౌండింగ్ కమిటీలో పశువైద్యాధికారులు ఉండాలని, కుల దృవీకరణ పత్రాలకు బదులు సొసైటీ అధ్యక్షుల సంతకాలతో అవకాశం కల్పించాలన్నారు.దీనిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అవినీతికి తావులేకుండా అమలు చే యాడానికి సమస్యలపై సీఎం కేసీఆర్, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చే స్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ గౌరవ అధ్యక్షులు చల్ల మల్ల య్య, జిల్లా సహాయ కార్య దర్శి కుండె లింగస్వామి, ఖానాపురం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాసా ప్రవీణ్ కుమార్, బొడ్డు రవి, జక్కుల మల్లేష్, నాంచారి కుమారసా ్వమి, జక్క రవి, మజ్జిగ రాంబాబు, బలిక లింగన్న, కంచ ఐలయ్య, నిమ్మల శ్రీనివాస్, నానబోయిన సుమన్, బోళ్ల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.