Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
ఆరుగాలం కష్టపడి పం డించిన పంటను రైతులు మా ర్కెట్లోకి తీసుకు వస్తే ధాన్యం కాంటాల వద్ద తరుగు పేరిట ఒక్కొక్క మొక్కజొన్న బస్తా నుం డి 10కేజీల చొప్పున తీసుకుం టూ రైతులను నిలువునా దో చుకుంటున్నారని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా వరంగల్ జిల్లా నాయకులు చిర్ర సూరి, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు కత్తుల కొమరయ్య లు ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తరుగు పేరిట మార్కెట్లో జరిగే దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులతో ధర్నా నిర్వహించి, డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మార్కెట్ సూపర్వైజర్ జ్యోతి ప్రకాష్ కి అందించారు. అనంతరం చిర్ర సూరి, కత్తుల కొమురయ్య లు మాట్లాడుతూ నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కు రైతుల పండించిన మొక్కజొన్న పంటలను అమ్మడానికి తీసుకువస్తుంటే, తరుగు పేరిట 10 కిలోల పంటను తీసుకోవడం చాలా అన్యాయమని దీనిపై సంబం ధిత వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎలాంటి తరుగు లేకుండా రైతుల పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా నెక్కొండ- చెన్నారావుపేట మండలాల సంయుక్త కమిటీ కార్యదర్శి అడ్డూరి రాజు, దాసరి వెంకటయ్య బానోతులాల్, మంగమ్మ, బోడ బాలు, బానోతు చార్య, భూక్య జ్యోతి, దాసరి వెంకటమ్మ, బోడ రెడ్యా తదితరులు పాల్గొన్నారు.