Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన పంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ-కమలాపూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో సామాజిక మ రుగుదొడ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని రూ.1.80లక్షలు మంజూరు చేసింది. రాజుల సొ మ్ము రాళ్లపాలైనట్లు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ మంజూరు చేసిన డబ్బులను పంచాయతీ కార్యదర్శు లు మరుగుదొడ్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సామాజిక మరుగుదొడ్లు అసంపూర్తిగా పనులు చేసి డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 23 గ్రామపంచాయతీలలో సుమారు 15 గ్రామపం చాయతీలు సామాజిక మరుగుదొడ్లను నిర్మాణం చే యకుండానే డబ్బులను స్వాహా చేసినట్లు ప్రజలు చ ర్చించుకుంటున్నారు. ప్రతీగ్రామంలో కార్యదర్శుల పర్యవేక్షణ సామాజిక మరుగుదొడ్ల విషయంలో నిర ్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు మండి పడుతున్నారు. కార్యదర్శులు సామాజిక మరుగుదొడ్ల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఉంటారని పలువురు చ ర్చించుకుంటున్నారు. అంబాల, శ్రీరాములపల్లి, నేరె ళ్ల, మిగితా గ్రామాలలో అసంపూర్తిగా నిర్మాణం చేశా రని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సా మాజిక మరుగుదొడ్లు ప్రజ లకు అందుబాటులోకి వ చ్చేవిధంగా చర్యలు తీసు కోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిధులను దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అధికారులే ని ధులను కాజేస్తున్నారని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ గ్రామపంచా యతీ కి ఆమడ దూరంలో ఉన్న సామాజిక మరుగు దొడ్ల వైపు పంచాయతీ కార్యదర్శులు అటువైపు చూడక పోవడం అనుమానాలకు తావిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు సామాజిక మరు గుదొడ్ల నిధుల స్వాహాపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నా రు. ఈ విషయం వివరణ పై ఎంపీడీవో పల్లవిని ఫో న్లో సంప్రదించగా ఫోను లిఫ్ట్ చేయలేదు.