Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చల్లా
నవతెలంగాణ-దామెర
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే పేదల సంక్షేమం అభివద్ధి సా ధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా దామెర మండలంలోని ముత్యాలపల్లి, తక్కలపాడు,ఊరుగొండ, దామె ర గ్రామాల ముఖ్య నాయకులతో పరకాల ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆత్మీ య సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్‌తోనే రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధ్యమయ్యాయి అని తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివద్ధిని ప్రజలు గ మనించాలని ముఖ్యంగా యువత గమనించాలని కోరారు.పార్టీని మరింత బలో పేతం చేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన అన్నారు బీఆర్ ఎస్ ప్రభు త్వం చేస్తున్న సంక్షేమఅభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎం పీపీ జాకీర్ ఆలీ, ముదిగొండ కృష్ణమూర్తి, శంకర్, దాడి రమేష్, జన్ను మల్లయ్య, ఇంగే బాబురావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లో చేరిన పలు పార్టీల కార్యకర్తలు
బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీల నాయకులు మంగళవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యేచల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ లో చేరిన వారిలో బండి రాజు, ఎండి.సోయల్, పోతుల చంద్రమౌళి, ముప్పిడి మొగిలి, దామెర కిరణ్ ,వడ్డేపల్లి సిరంజీవిబీ దామెర రాజు, మధు తదితర యువ కులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోలం కపాక ర్‌రెడ్డి, బిల్ల రమణారెడ్డి, గరిగే కృష్ణమూర్తి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.