Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఈపీ ఎఫ్, పీఎఫ్ లాంటి సౌకర్యాలు క ల్పించకుండా తీవ్రఅన్యాయం చే స్తూ, వెట్టి చాకరి చేయించుకుం టుందని, వరంగల్ జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం కార్య దర్శి అబ్బదసి అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని పాప య్యపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయి పల్లె గ్రామపంచాయతీలో ఇటీవల వీధి నిర్వహణలో వాటర్ పైప్లైన్ మరమ్మత్తులు పనులు చేస్తుండగా ప్రమాదానికి గురై చనిపో యిన వీణవంక శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించి మతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేసియాతోపాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుడు వేణువంక శంకర్ మృతితో తన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలోని గ్రామపంచాయతీ కార్మికులను సెలవు రోజుల్లో కూడా బండ చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రామ పం చాయతీ కార్మికులు కంచ దూడయ్య, గుండె ఐలయ్య,బొక్కల శ్యామ్ కుమార్, కన్నం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.