Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రప్రభు త్వం ముందుకు వెళుతుందని వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ధి లక్ష్యంగా గ్రేటర్ వరంగల్ విలిన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని మడికొం డలో రూ.2కోట్లతో చేపట్టిన సీసీరోడ్లు, సైడ్ డ్రైన్లను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించి పలు రోడ్ల నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మడికొండ లోని వాసవి ఫంక్షన్ హలో ఏర్పాటు చేసిన రంజాన్ కానుకల పంపిణి కార్యక్ర మానికి ఎమ్మెల్యే ముఖ్య అ తిథిగా హాజరై ముస్లీంల కు రంజాన్ కానుకలను అందజేశారు.అనంతరం కాజీపేట మండలానికి చెం దిన ఏడుగురికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధి దారులకు రూ.7,00882 విలువగల చెక్కులను ఆరు గురికి ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.1.49 లక్షల విలువగల చెక్కులను మొత్తం 8 లక్షల 49వేల 882 చెక్కులను లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి పట్టికగా సీఎం కేసీఆర్పాలన సాగు తుందన్నారు. ప్రతి సంవ త్సరం ముస్లీంలకు రంజా న్కానుకలు అందిం చడం జరుగు తుందని తెలిపా రు. పేదింటి ఆడపిల్ల పె ళ్లికి కల్యాణ లక్ష్మి షాదీ ము బారక్ చెక్కులు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారికి సీ ఎం సహాయ నిధి ప్రభుత్వ అందిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లో అన్నికులాలకు మతాలకు సమన్యాయం జరుగు తుందని, పేదప్రజలసంక్షేమమే లక్ష్యంగా పాలన సా గుతుందన్నారు. గ్రేటర్ వరంగల్ విలిన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, 46వ డివిజన్ లో రెండు కోట్ల నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించి శం కుస్థాపన చేయడం జరిగిందన్నారు.
మడికొండ గ్రామాన్ని అన్ని విధాల అభివద్ధి చేయడం లో ముందు ఉంటానని తెలిపారు. కెసిఆర్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గపరిధిలో ప్రతి గడపగడపకు అందు తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగాల సరోజన కరుణాకర్, అవాలా రాధిక రెడ్డి, ఇండ్ల నాగేశ్వరరావు, దర్గా సొసైటీ చైర్మన్ వనం రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొల్లికొండ వినోద్ కుమార్, నాయకులు బస్కే రాజేందర్, బస్కే కష్ణ, రామ్మూర్తి పోలేపల్లి, కుందూరి రాజేష్ రెడ్డి, కుమార్ రాజ్, ఈదురు అనిల్ కుమార్ ముస్లిం పెద్దలు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.