Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
ప్రైవేటు పాఠశాలలకు ధీటు గా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నా యని వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులను అధికసంఖ్యలో న మోదు చేసే విధంగా ఉపాధ్యా యులు పనిచేయాలని, నోడల్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్తేజ అన్నారు. మండల పరిధిలోని ఖాదర్ పేట ప్రాథ మిక పాఠశాల,హైస్కూల్ పాపయ్యపేట ప్రాధమిక పాఠశాల,అమతండా ప్రాథ మిక పాఠశాలలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్శన లో మన ఊరు మన బడి అభివద్ధి పనులు ను పూర్తిగా పరిశీలించారు. ఈ పరిశీలనలో ఖాదర్ పేట ప్రాధమిక పాఠశాల మన ఊరు మన బడి పాఠశాలలో ప్రారంభించడానికి సిద్ధం అయిందన్నారు. మిగిలినపాఠశాలలో పనులు జరుగుతున్నాయని తెలిపా రు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం ను,విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీ రును ఉపాధ్యాయుల,విద్యార్థుల హాజరురిజిస్టర్లు, మనఊరు-మనబడి అభివద్ధి పనుల రికార్డులను పరిశీలించారు. మన ఊరు మన బడి పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో అభివద్ధి చెందాలని తెలిపారు.
ఈనెల 24న ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి విద్యా ర్థులుకు ప్రోగ్రెస్ రికార్డులను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకళ, కట్టస్వామి, కుమారస్వామి, కిరణ్కుమార్, ఉపాద్యాయులు ఉమా శంక ర్, వెంకటేశ్వర్లు, శ్యామ్ సుందర్, వెంకన్న, సీఆర్పీ సంపత్, ఎస్ఎంసి చైర్మన్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.