Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నమాల
నవతెలంగాణ-వరంగల్
జ్యోతి ఇండిస్టీస్ యాజమా న్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని మతురాలి కవిత కుటుం బానికి న్యాయం చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురా లు నలిగంటి రత్నమాల అన్నా రు.వరంగల్ జిల్లా కొత్తపేట ప్రాం తంలోని జ్యోతి ఇండిస్టీయల్ కారప్పొడి మిల్లులో కార్మికు రాలుగా ఐదేళ్లుగా కష్టించి పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ప్రతా పగిరి కవిత సోమవారం కారంపొడి మిషన్ వద్ద పనిచేస్తుండగా ఇండిస్టియల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మిల్లుపై నుంచి భారీ పరికరం కార్మికురాలు కవిత తలపైపడడంతో అక్కడికక్కడే మతి చెందిందన్నారు. కవితకు ఇద్దరు చిన్నపిల్లలు, భర్త, అత్త తన కూలిపై ఆధారపడి జీవిస్తున్నారు. కవిత మృతితో వారు అనాథలుగా మిగిలారని యాజ మాన్యం నిర్లక్ష్యం వల్లే కవిత మృతి చెందింది ఈ ఘటనపై ప్రభుత్వం యాజమా న్యంపై కఠినచర్యలు తీసుకోవాలి తన కుటుంబ సభ్యులను పిల్లల పరిరక్షణ నిమి త్తం కవిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అలాగే కూతురు సన్నిహిత, కొడుకు ఉదరు కిరణ్లను ప్రభుత్వం ఆదుకొని వారికి ఉచిత విద్య వై ద్యం అందించడంతోపాటు ఆమె భర్త వెంకటేష్ కు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల న్నారు. ఇండిస్టీస్ని లేబర్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని సీపీఎం వరంగల్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఖిలా వరంగల్ సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు దుర్గయ్య, ఉదయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, ఐద్వా నాయకురాలు నీలమ్మ, రాధక్క పాల్గొన్నారు.