Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇం జనీరింగ్ అధికారులను ఆదేశిం చారు. అండర్ రైల్వే గేట్ ప్రాం తంలోని 13 నీటి రిజర్వాయర్ లకు నీటిసరఫరా జరిగే ధర్మసా గర్ నుండి వచ్చే 60 ఎంఎల్డీ ప్రధాన పైపు లైన్ లపై గల స్లుయిస్ వాల్వు లను బట్టుపల్లి క్రాసింగ్ అమ్మవారిపేట, పెరుకావాడ, రంగయ్య జంక్షన్ వద్ద మేయర్ మంగళ వారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థ వంతంగా నిర్వహించుటకు అధి కారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా చిత్తశుద్ధితో పని చేయాలని, జవాబుదారీత నంతో వ్యవహరిస్తూ నిర్దేశిత షెడ్యూలు ప్రకారం రిజర్వాయర్లను నింపడంతో పాటు నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, ఇందుకోసం రిజిష్టర్లో ప్రతి రోజు నీటి విడుదల సంబంధిత సమాచారాన్ని నమోదు చేయాలని, ఇంజ నీరింగ్ అధి కారులు నిరంతరం పర్య వేక్షణ చేయా లని అన్నారు.అసిస్టెంట్ ఇంజనీర్లు వాల్వ్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కరీంబాద్ , సుభాష్ నగర్ ఓ హెచ్ ఎస్ఆర్ల పరిధిలో మంచి నీటి సరఫరా జరగడం లేదని ఆ ప్రాంత వాసులు ఫి ర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అండర్ రైల్వే జోన్ పరిధిలో ప్రాంతంలో గతంలో ప్రతిరోజు నీటి సరఫరా జరిగేదని, ప్రతిరోజు ధర్మసాగర్ ప్రధాన పైపులైన్ నుండి 60 ఎంఎల్డి నీటి సరఫరా జరుగుతున్నపటికి, ఆపరేటింగ్ నిర్వహణ లోపంవల్ల అండర్ రైల్వే జోన్ పరిధిలోగల వాటర్ ట్యాంకులు సక్రమంగా నింపకపోవడం వల్ల ప్రతి రోజు సర ఫరా జరగడం లేదని, వాల్వ్ ఆపరేటింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ట్యాంక్ లు నింపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భద్రకాళి బండ్ సమీపంలో గల గాయత్రిమాత ఆలయ సమీపంలో గల నీటి రిజర్వాయర్ కు గతంలో మాదిరిగా దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నుండి నీటి సరఫరా జరిగేలా చూడాలని మేయర్ అధికారు లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివా స్, డిఈలు సంతోష్ బాబు, నరేందర్, రవి కిరణ్, ఏఈలు వెంకటేశ్వర్లు, మోజామిల్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.